Home » Tag » New variant
కరోనా ఈ పేరు వింటే చాలు మనుషులు అమడ దూరం ఊరుకుతారు. యావత్ ప్రపంచానే వణికించింది ఈ కొవిడ్. 2020లో కరోనా ప్రపంచాన్ని 20/20 మ్యాచ్ ఆడింది.
దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. కరోనా కొన్నాళ్లుగా.. తగ్గుముఖం పట్టే పడుతున్న తాజాగా కొత్త వేరియంట్లు కలవర పెడుతున్నాయి. దేశంలో మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలో వ్యాప్తి చెందుతోన్న JN.1 సబ్ వేరియంట్ కేరళలో తొలిసారి బయట పడింది.
చైనాలో కోవిడ్ మళ్లీ కోరలు చాస్తుంది. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో అన్నట్లు కేసుల దుందుబి మోగిస్తుంది. రికార్డ్ స్థాయిలో వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాట్లు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంతటి దీన పరిస్థితుల్లో ఆ దేశం ఉందో.
కరోనాను అంతా లైట్ తీసుకున్నారు. ఎక్కడా ఎవరూ మాస్క్‌లతో కనిపించడంలేదు. సోషల్ డిస్టెన్స్ ఎవరూ పాటించడంలేదు. శానిటైజర్ స్పెల్లింగ్ కూడా చాలా మంది మర్చిపోయినట్టున్నారు. అందుకే కరోనా కేసులు మళ్లీ కంట్రోల్ లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. సరిగ్గా నాలుగు వారాల క్రితం పరిస్థితి వేరేలా ఉండేది. అప్పుడు రెండు వేల కేసులు వస్తే అదే ఎక్కువ. కానీ జస్ట్ త్రీ వీక్స్‌లో సిచ్యువేషన్ మారిపోయింది.
కరోనా వైరస్ సరికొత్తగా రూపాంతరం చెంది ప్రాణాలను బలిగొంటుంది. నేటికీ దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ 10వేల కేసులు నమోదు అవుతున్నాయి.
పీడ వదిలింది అనుకుంటే.. మళ్లీ పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా బాధితులు పెరుగుతున్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కీలక మార్గదర్శకాలు సూచించింది.