Home » Tag » NIA
ఘటన జరిగిన తర్వాత నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. నిందితుడు ధరించిన టోపీ ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ధరించిన టోపీ ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి అంశాల ఆధారంగా అతడి వివరాలు కనుక్కున్నారు.
పేలుడు ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నిందితుడిని పట్టుకునే విషయంలో కీలక ప్రకటన చేసింది ఎన్ఐఏ. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల బహుమతి (రివార్డ్) ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.
తమిళనాడు (Tamil Nadu) లో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) (National Investigation Agency) సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు, చెన్నై, తిరుచ్చి సహా 27 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు (raids) చేస్తున్నారు.
రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే చర్చ మొదలైంది. అతని కోసం కెనడా ఎందుకింత తాపత్రయపడుతోందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. భారత్ బ్యాన్ చేసిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేతే ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్.
కెనడాలో ఉంటూ, కెనడాతో సంబంధాలు కలిగి ఉన్న 43 మంది ఉగ్రవాదుల జాబితాను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూపొందించింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ చాలా మంది ఉన్నారు. వీరు కెనడా కేంద్రంగా పని చేయడమే కాదు.. పాకిస్తాన్ తీవ్రవాదులు, ఐఎస్ఐతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు.
నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. వరలక్ష్మి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ అయ్యాడు. కేరళలోని ఓ ప్రాంతంలో 3వందల కిలోల హెరాయిన్, ఒక ఏకే 47తో దొరికాడు ఆదిలింగం.
రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసుతోపాటు వివేకా హత్య కేసు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది.