Home » Tag » Nithish Kumar
జనాల్లోకి వెళ్లాలి.. వాళ్ల కష్టాలు వినాలి.. ఆ కష్టంలో భాగం అవ్వాలి.. నేనున్నాను నేను విన్నాను అని హామీ ఇవ్వాలి.. వాళ్ల మనసు గెలుచుకోవాలి. ఇదీ ఒకప్పటి రాజకీయం. రాజకీయ పార్టీలన్నీ ఇలానే చేసేవి గతంలో. కానీ ఇప్పుడు డబ్బు ఆడుతున్న ఆటలో రాజకీయం.. ఆ నోటు కిందే నలిగిపోతోంది. పార్టీలన్నీ ఇవే ఫాలో అవుతున్నాయ్. వ్యూహకర్తల మీదే భారం వేస్తూ.. వాళ్లకే ఎన్నికలు అప్పచెప్తున్నాయ్.
లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2014, 2019 విజయభేరిని కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయంపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. మరోసారి విజయంతో మూడోసారి దేశ ప్రధానిగా కొనసాగాలని మోదీ భావిస్తున్నారు. ఆయనకున్న వ్యక్తి గత చరిష్మా, బీజేపీ అమలు చేసే పోల్ స్ట్రాటజీతో విజయం తమ పార్టీనే వరిస్తుందని కమలనాథులు గంపెడు ఆశలతో ఉన్నారు.
ప్రాంతాలు వేరు.. పార్టీలు వేరు.. వాళ్ల జెండా..ఎజెండా కూడా వేర్వేరు. కానీ కామన్‌గా వాళ్లంతా కోరుకుంటున్నది మాత్రం ఒక్కటే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవకూడదు. మరోసారి మోడీ అధికారంలోకి రాకూడదు. దీని కోసం వ్యూహాలు, ప్రతివ్యూహాలు, చర్చోపచర్చలు కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. పార్టీల మధ్య భావసారుప్యత లేకపోయినా.. మోదీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్.. ఢిల్లీలో బీజేపీని గద్దెదించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. కలిసి ఉన్నది ఎవరు.. కలిసి వచ్చేది ఎవరు అన్న లెక్కలు పక్కనపెడితే.. కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో ఇప్పటికీ కన్ఫ్యూజింగ్గానే ఉంది చాలామందికి ! జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టి.. ఢిల్లీపై దండయాత్ర చేసి కమలం పార్టీని దెబ్బతీయాలన్నది కేసీఆర్ వ్యూహం.
నేను గెలుస్తాను అని చెప్తే ఎవరూ వినరు.. గెలిచాక చెప్తే ఎవరైనా వింటారు. కాంగ్రెస్‌కు పక్కాగా సరిపోయే మాట ఇది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్ పేరు చెప్తే ఇన్నాళ్లు దూరం జరిగిన పార్టీలు.. ఇప్పుడు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయ్. హస్తం పార్టీ పని అయిపోయింది. మూడో కూటమి రావాల్సిన అవసరం ఉందని రాగం అందుకున్న నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు జై అంటున్నారు. మద్దతు ప్రకటిస్తున్నారు.
రాజకీయం కోసం నేతలు ఎంతకైనా దిగజారతారు.. వారికి ఓట్లే ముఖ్యం.. అవసరమైతే మాఫియా కాళ్లు పట్టుకుంటారు. అంతకుమించి కూడా చేస్తారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇప్పుడు దాన్ని మరోసారి నిరూపించారు. ఓ తెలుగుబిడ్డను దారుణంగా చంపిన గ్యాంగ్‌స్టర్‌ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్యాంగ్‌స్టర్ అంటే నితీశ్‌కు ఎందుకంత ప్రేమ.? ఆ ఒక్కడి చుట్టూ బీహార్ రాజకీయం ఎందుకు తిరుగుతోంది.?