Home » Tag » Nitish Kumar Reddy
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ సారి మరింత క్రేజీగా మారింది. గత రెండు సార్లు టీమిండియానే పైచేయిగా సాధించడం ఆస్ట్రేలియా జీర్ణించుకోలేకపోతోంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ సొంతగడ్డపై తమదే పైచేయిగా నిలవాలని పట్టుదలగా ఉన్న కంగారూలు సిరీస్ కోసం రెడీ అయ్యారు.
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా మూడురోజుల టైముంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్ను తొలి టెస్టుతో ఐదు టెస్టుల సిరీస్ కు తెరలేవనుంది. మూడోసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనుకుంటున్న టీమిండియాకు కొన్ని ఊహించని చిక్కులు ఎదురయ్యాయి.
మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవాలనుకుంటున్న భారత్ ఆస్ట్రేలియా టూర్ కోసం స్ట్రాంగ్ టీమ్ నే ఎంపిక చేసింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియా పర్యటనకు 18 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.టెస్ట్ జట్టులో తొలిసారి విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో ఈ సారి టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోంది. దీని కోసం వచ్చే నెలలో ఆస్ట్రేలియాకు వెళ్ళనున్న భారత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గత రెండు పర్యాయాలు కంగారూలకు వారి సొంతగడ్డపైనే షాకిచ్చి సిరీస్ లు గెలిచింది.
టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఏ సిరీస్ కు ఏ ఆటగాళ్ళు జట్టులో ఉంటే బెటరో అన్నదానిపై పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నాడు. ఫామ్ , ఫిట్ నెస్ వంటి విషయాల్లో ఏ మాత్రం రాజీ పడడం లేదు.
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలుపుకోవడం అంత కంటే కష్టం... వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటితేనే జట్టులో ప్లేస్ ఉంటుంది. ఈ విషయంలో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కాస్త వ్యూహాత్మకంగానే ముందున్నట్టు చెప్పొచ్చు.
ఐపీఎల్ మెగావేలానికి ముందు బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ఫ్రాంచైజీలకు ఆర్థికంగా గట్టి షాక్ ఇవ్వబోతోంది. ఊహించినట్టే పలువురు యువక్రికెటర్లు ఈ సిరీస్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నారు. దీంతో అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ నుంచి క్యాప్ట్ ప్లేయర్స్ గా మారిపోతున్నారు.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ సిరీస్ కు రెడీ అవుతోంది. సీనియర్లతో పాటు పలువురు స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో టీ ట్వంటీ సిరీస్ లో కుర్రాళ్ళకు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ జట్టు బంగ్లాను స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.
యువక్రికెటర్, తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి జాక్ పాట్ కొట్టాడు. గాయంతో జింబాబ్వే పర్యటనకు దూరమవడం నిరాశ కలిగించిన ఈ యంగ్ ప్లేయర్ కు గొప్ప ఆఫర్ దక్కింది.
ఐపీఎల్ (IPL) లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు, ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మరోసారి విధ్వంసం సృష్టించాడు.