Home » Tag » No Confidence Motion
మోడీ స్పీచ్ ఆసాంతం కాంగ్రెస్‌పై దాడిగా సాగింది. ఇండియా కూటమిపై మోడీకి భయం పట్టుకున్నట్లు కనిపించింది. విపక్షాలు పదే పదే మోడీని టార్గెట్ చేస్తే, ఇండియా కూటమిని ప్రధాని టార్గెట్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యాన్ని సభలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 8 నుంచి 10 వరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్, ప్రధాని ప్రకటన ఉంటాయి. మూడు రోజుల్ని అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్ కేటాయించారు. గత నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మంచి ప్రశ్న లేవనెత్తారు... పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బాగానే ఉంది... అలా అడగాలి కూడా... మరి ఇంతకీ వైసీపీ ఎటువైపుంది విజయసాయిరెడ్డి గారు...! బీజేపీ వైపా లేక ఇండియా కూటమివైపా....?
తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అంతా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న వారే. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, వీపీ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవగౌడ, వాజ్‌పేయి, మన్మోహన్సింగ్, 2018లో చివరిసారిగా నరేంద్ర మోడీ అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు.
మణిపూర్ హింస తరుణంలో.. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానాల చరిత్ర, పార్లమెంట్లో పార్టీల బలాబలాలపై చర్చ జరుగుతోంది. వీగిపోతుందని తెలిసినా.. అవిశ్వాసం పెట్టడం వెనుక తమ వ్యూహం తమకు ఉందంటున్నాయి విపక్షాలు.
బుధవారం ఉదయం కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ కూడా స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించిన స్పీకర్ అవిశ్వాస తీర్మానానికి అంగీకరించారు. ఈ అవిశ్వాసం ఎలాగూ వీగిపోతుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసు.