Home » Tag » ntr gardens
తెలంగాణ నూతన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని హంగులతో ఇది తయారైంది. అన్ని విభాగాలు ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంది.
అంటరాని తనం, అస్పృశ్యత, కుల నిర్మూల, సమాన హక్కులు, స్వేచ్ఛ, మహిళా స్వాతంత్యం అనే బీజాక్షరాలను తన మస్తిష్కంలో అను నిత్యం జపిస్తూ.. సమాజ శ్రేయస్సుకు పరితపించిన దూర దృష్టి గల మేధావి. అలాగే తన కోసం కాకుండా అందరి కోసం అట్టడుగు వర్గాల్లో చైతన్యం నింపాలనే సత్ సంకల్పంతో అద్భుతమైన రాజ్యంగాన్ని రచించిన గ్రంధకర్త, న్యాయవాది, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, నవ జీవన సృష్టి ప్రదాత డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్.
అత్యంత రమణీయంగా ట్యాంక్ బండ్ మారనుందా..? నెక్లెస్ రోడ్డు మెడలో మరో మణిహారాన్ని అలంకరించారా..? హైదరాబాద్ నగరవాసులకు అత్యంత వింతానుభూతిని ఇవ్వనున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సండే ఫన్ డే.