Home » Tag » ODI
మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకరానున్నారు. ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ విధానం అమలు చేయనున్నారు.
నిన్నటి మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్ తన కెరీర్ ఆఖరి మ్యాచ్‌తో వరల్డ్‌కప్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 711 పరుగుల తర్వాత సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు డికాక్.
అశ్విన్ క్లాస్ బౌలర్. ఒత్తిడిని ఎలా అధిగమించాలో బాగా తెలుసు. చాన్నాళ్ల నుంచి భారత క్రికెట్ ఆడుతున్నాడు. ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్. ఆసీస్‌తో గత రెండు వన్డేలు మినహా గతేడాదిన్నర నుంచి అంతర్జాతీయంగా 50 ఓవర్ల క్రికెట్ ఆడలేదు. అయినా సరే అతడి అనుభవం, సీనియారిటీని పక్కన పెట్టలేం.
ఈ మూడు వన్డేలకు టీమిండియా ఇప్పటికే వేర్వేరు జట్లను ప్రకటించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌తో పాటు ప్రపంచకప్‌పై టీమిండియా కన్నేసింది. మన జట్టు 3-0తో ఆసీస్ సిరీస్‌ను వైట్‌వాష్ చేస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌కు చేరుకుంటుంది.
భారత్ గెలుపును పాక్ సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఇండియా కన్నా మేమే గ్రేట్ అని పాక్ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజా ICC వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆసియా కప్ గెలిచింది టీమిండియానే అయినా నెంబర్ వన్ కిరీటం మాత్రం పాక్ ఎగరేసుకుపోయింది.
124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేసిన స్టోక్స్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డేల్లో, నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు.
భారత మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని టిక్కెట్ బుకింగ్ వెబ్సైట్లు భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని టిక్కెట్లను విక్రయించాయి.
టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రావడం చాలా కష్టం అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్.
ఈ టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియాకు తిలక్ వర్మ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్ లభించడం విశేషం. భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన తిలక్.. తొలి సిరీస్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరీస్ మొత్తంలో టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైనా.. అరంగేట్రం అవకాశం దక్కించుకున్న తిలక్.. జట్టుకు అద్భుత ప్రదర్శన చేశాడు.