Home » Tag » odisha train accident
యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. రోజుకో మాట చెప్పింది రైల్వేశాఖ..! ఇంతలోనే కుట్ర అంటూ.. బయట శక్తులో.. లోపల మనుషులో ఏదో చేశారంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. సీబీఐ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది.
దేశంలో పదేళ్లలో రైలు ప్రమాదాల వల్ల 2.6 లక్షల మంది మరణించారు. గడిచిన పదేళ్లలో రైల్వే సంబంధిత కారణాలు/ప్రమాదాల వల్ల సగటున 2.6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీటిలో ఎక్కువ శాతం మరణాలకు రైళ్లు ఢీకొనడం లేదా పట్టాలు తప్పడం కారణం కాదు.
ఇప్పటివరకు 151కిపైగా మృతదేహాల్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల వివరాల్ని గుర్తించడం మాత్రం కష్టంగా ఉంది. దాదాపు 121కిపైగా మృతదేహాల్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం.
ఈ కేసులో కుట్ర కోణం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. అందుకే ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ ఆదేశించింది. కాగా, ఈ ఘటనకు గల కారణాల్ని రైల్వే శాఖ గుర్తించింది.
అక్కడ శవాలున్నాయి.. చెల్లాచెదురుగా పడిన అవయవాలున్నాయి.. తెగిపడ్డ కాళ్లూ.. విరిగిపోయిన చేతులు.. పగిలిన తలలు..ఎటు చూసిన రక్తమే..! భయకంపితులైన ప్రజల హాహాకారాలు.. తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలతో ఒడిశా బాలేశ్వర్ రైళ్లు ప్రమాద దృశ్యాలు గుండెల్నీ పిండేస్తున్నాయి.