Home » Tag » Om Namahsivaya
శివరాత్రి.. ఇది ప్రతినెలా అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి రోజున వస్తుంది. దానిని మాసశివరాత్రి అంటారు. అదే మాఘమాస కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థశిని మహా శివరాత్రి అంటారు. శివరాత్రి అంటే యోగులకు మహా శక్తివంతమైన రోజు. సాధువులు తపస్సును తీసుకొని ఆ మహాశక్తి ద్వారా యోగాన్ని పోందేరోజు. పరమేశ్వరుని దివ్యశక్తి అందరికీ అందుబాటులో ఉండే రోజు.
మహా శివరాత్రి రోజు జాగరణ ఉంటే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అందుకోసం చాలా మంది జాగరణ చేస్తుంటారు. అయితే జాగరణ చేసే పద్ధతి ఏంటి..? జాగరణ ఎలా చేయాలి?