Home » Tag » Ongole
ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీని వీడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి బరిలో ఉంటారని, తనకు అందించిన సహకారాన్ని రాఘవరెడ్డికి అందించాలని ప్రజలను కోరారు.
ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది వైసీపీ (YCP)లో ! అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా.. జగన్ రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. రాజకీయాన్ని వేడెక్కించడమే కాదు.. ఫ్యాన్ పార్టీ నేతలకు చెమట్లు పట్టిస్తున్నాయ్. నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వైసీపీ నాయకులు నిద్రలేకుండా చేస్తున్నాయ్.
బాలినేని శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ మాజీ అటవీ, విద్యుత్ శాఖ మంత్రి. ప్రస్తుతం ఈయనను అలకల శ్రీనివాస్ అని కూడా అంటున్నారు కొందరు. అందుకే నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీసులో కలిసేందుకు వెళ్తున్నారు. ఒంగోలులో జరిగే తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.
పోలీసుల తీరును నిరసిస్తూ.. బాలినేని తాజాగా తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీకి, గుంటూరు రేంజ్ ఐజీకి లేఖ రాశారు. దీనంతటికీ నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కుంభకోణమే కారణం.
బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఐతే వీరిని సస్పెండ్ చేస్తున్న విషయం తనకు ఏమాత్రం చెప్పకుండా.. సస్పెండ్ చేయడంపై బాలినేని అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.