Home » Tag » onion prices
పాకిస్తాన్లోని ఉల్లి వ్యాపారులు వివిధ దేశాలకు ఉల్లి ఎగుమతి చేస్తూ.. భారీ ఆదాయం పొందుతున్నారు. అయితే.. పాకిస్తాన్కు ఆదాయం పెరగాలి కదా.. అక్కడి నుంచే విదేశాలకు వెళ్తుంటే ఉల్లి ధర ఎందుకు పెరిగిందనే అనుమానాలు రావొచ్చు.
మొన్న టమాటా.. నేడు ఉల్లి.. ప్రజల చేత కంగుతినిపిస్తుంది. నెల రోజులుగా ఉల్లి ధర రూ.60 నుంచి 70 పై మాటే. ఉల్లిపాయ రేటు తగ్గుతుందని మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్న.. ధరలు మాత్రం పక్క మోట్టూ కూడా దిగడంలేదు. అంతకంతకు పెరుగుతునే పోతుంది. నిజానికి మార్కెట్ లోకి కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్తితి మారలేదు. దీనికి కారణం ధలరీలు, కమీషన్ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
రోజూ తినే కర్రీల్లో ఉల్లిలేనిదే ముద్దదిగదని భావిస్తూ ఉంటారు కొందరు. అలాంటి వారికి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఉల్లి ధరలు చేదు అనుభూతిని ఇస్తోంది. కేజీపై సగటున 20 నుంచి 30 రూపాయలు అధిక భారం పడుతోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం కర్నూలు రైతు బజార్లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40 దాకా పలుకుతోంది. బయటి మార్కెట్లో ఈ ధర రూ.35 నుంచి రూ.45 దాకా ఉంది. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని కర్నూలు రైతు బజార్ వర్గాలు తెలిపాయి.
ఈ నెలాఖరుకు ఉల్లి సరఫరా ఇంకా తగ్గుతుంది. దీంతో నెమ్మదిగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40 వరకు ఉన్న ధరలు ఈ నెలాఖరుకు రూ.60 నుంచి రూ.70 వరకు చేరే అవకాశం ఉంది. సెప్టెంబర్లో అంతకుమించి పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
టమాట కొనలేక.. కూరలు రుచిలేక.. కొనే ధైర్యం లేక.. మధ్య తరగతి జనాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. టమాటా ధరలు మోతెక్కిపోతుంటే.. ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకు రాబోతోంది. ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.