Home » Tag » Opposition
ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయ్. ప్రతిపక్షం లేని సభలో.. కూటమి ఎమ్మెల్యే తీరు ఎలా ఉండబోతుంది.. చంద్రబాబు సర్కార్‌ను ఢీకొట్టే సత్తా ఒక్క జగన్‌కు ఉందా..?
ఏపీలో వైసీపీ ఆఫీసు రాజకీయానికి మాత్రమే పరిమితమా? అసెంబ్లీలో అడ్రెస్ కష్టమే. నిన్నటి దాకా తిరుగులేని అధికారంతో పెత్తనం చెలాయించిన పార్టీకి రేపు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. వైసీపీ కనీసం పది శాతం సీట్లు కూడా సాధించకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కదు. వై నాట్ 175 అన్న పార్టీ... పట్టుమని 11 మంది ఎమ్మెల్యేల దగ్గరే ఎలా ఆగిపోయింది.
ప్రతిపక్ష నేతలను టార్గెట్ గా చేసుకొని BRS సర్కార్ లోని పెద్దలు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ సామాన్యుల సంసారాల్లోనూ నిప్పులు పోసింది.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారం అనడం కంటే.. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు యుద్ధం జరుగుతోంది అంటే కరెక్ట్‌గా ఉంటుందేమో. అదే స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు. ప్రత్యర్థులపై బురద జల్లేందుకు ఉన్న చిన్న అవకాశాన్ని కూడా వదలిపెట్టుకోవడంలేదు.
రీంసెట్‌గా ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గ్రూప్స్ వాయిదా పడ్డ కారణంగానే ప్రవళిక చనిపోయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ప్రేమ వ్యవహరం కారణమని పోలీసులు చెప్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు మరింత సీరియస్ అయ్యారు. కేసును తప్పుదారి పట్టించేందుకు అమ్మాయి క్యారెక్టర్ మీద మచ్చ వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. చిరవకి ప్రవళిక తల్లి స్పందనతో కథ మొత్తం మలుపు తిరగింది.
తెలంగాణలో ప్రవళిక ఆత్మహత్య కేసు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అనే రేంజ్లో యుద్ధం సాగింది. ప్రేమ విఫలం అయ్యే ప్రవలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అంటే.. అసలు ఆమె గ్రూప్స్‌కు కూడా అప్లై చేసినట్లు సమాచారం కూడా లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చరేపాయి. ఐతే అదే కేటీఆర్.. ప్రవళిక కుటుంబసభ్యులను కలిసి.. ఆమె తమ్ముడికి ఉద్యోగం హామీ ఇవ్వడంతో.. వ్యవహారం మరింత హీటెక్కింది.
మణిపూర్ అంశంపై చర్చించే అంశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం నడుస్తోంది. దీనికి తాజాగా ప్రతిపక్షాలు కొత్త మార్గాన్ని సూచించాయి. అయితే, ప్రతిపక్షాల ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తుందా.. లేదో చూడాలి.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను కూడా ప్రెస్ మీట్లు పెట్టేసే నేతలు చెప్పేస్తున్నారు. మీడియా ముందే వాదించుకుంటున్నారు. సమాధానాలు చెప్పేసుకుంటున్నారు. అందుకేనేమో ఇక అసెంబ్లీతో పనేముంది అనుకున్నట్టున్నారు మన నేతలు.
ప్రధాని మోదీ మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రకటన చేయకపోవడానికి నిరసనగా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. బుధవారమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మణిపూర్‌లో ప్రభుత్వం వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభ సాగడం లేదు. సభాకార్యకాలాపాలకు అంతరాయం కలుగుతుండటంతో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని, ప్రతిపక్షాల తీరు మారలేదని విమర్శించారు.