Home » Tag » opposition parties
కనిపించే మూడు సింహాలు సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీకలయితే.. కనిపించని నాలుగో సింహమే.. పోలీస్. అలాంటి పోలీసులు ఇప్పుడు కనిపించాలన్న ఆలోచిస్తున్నారు.
39మంది ఎమ్మెల్యేలతో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీఆర్ఎస్ (BRS). ఇక రాజకీయంగా అధికార, విపక్ష పార్టీల (Opposition parties) మధ్య వివిధ అంశాలపై మాటల తూటాలు పేలుతున్నాయ్. 2014, 18 అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) ముగిశాక.. కొద్దిరోజులకు నాటి కాంగ్రెస్ (Congress ) ఎమ్మెల్యేలు కొందరు కారెక్కారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా వారం కూడా కాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇక ప్రొటెం స్పీకర్ విషయంలో లొల్లి చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే యుద్ధం చేస్తామని ముందే హెచ్చరించింది గులాబీ పార్టీ. కానీ కొంత టైమ్ ఇస్తుందని అనుకున్నా.. తొందరగానే ఎదురుదాడి ప్రారంభించింది.
కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా... ఇప్పటి వరకు సభలో మణిపూర్‌పై చర్చే జరగలేదు. కాలం గడిచే కొద్దీ.. అన్ని పార్టీలకు మణిపూర్ కూడా ఎన్నికల అంశంగా మారిపోతుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్లు కాపాడుకునే బిజీలో ఉంటారు. మణిపూర్ మాత్రం నగ్నంగా రోధిస్తూనే ఉంటుంది.
ఇప్పటికైనా బుగ్గన మౌనం వీడి ఏపీ అప్పులపై స్పందిస్తే బాగుంటుంది. 10లక్షల కోట్లు ఏమయ్యాయన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఆయన చెబితేనే సరిగ్గా ఉంటుంది. వాళ్లూ వీళ్ల కన్నా ఆయన సమాధానమే ముఖ్యం. మరి ఇంతకీ బుగ్గన దీనిపై స్పందిస్తారా...? మనకెందుకొచ్చిందిలే అని ఊరుకుంటారా...? లేక వైసీపీ పెద్దల ఆదేశాలతో తూతూ మంత్రంగా స్పందించి సైడైపోతారా...?
మద్యపాన నిషేధాన్ని అమలు చేసే సాహసం జగన్ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ హామీని లేవనెత్తుతున్నాయి. దీనికి జగన్ జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ను పట్టించుకునే వాళ్లే లేరు. ఒక పక్క కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే మిత్ర పక్షాలు భేటీ అవుతుంటే.. రెండింట్లోనూ కేసీఆర్‌కు ఆహ్వానం లేదు. ఎన్డీయేతోపాటు, ప్రతిపక్షాలు బలపడుతుంటూ బీఆర్ఎస్ పక్కన నిలబడి చూడాల్సి వస్తోంది.
పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షానికి చెందిన 19 పార్టీలు ప్రకటించాయి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభం విషయంలో ఒక్క మాటపై ఉంటే.. కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఒక్క గెలుపు.. ఒకే ఒక్క గెలుపు దేశ రాజకీయాన్ని మార్చేసేలా కనిపిస్తోంది. ఎన్నాళ్లో వేచిన ఉదయం కాంగ్రెస్‌కు కొత్త ఊపిరిలూదడమే కాదు.. ప్రతిపక్షాల ఐక్యతకు జీవం పోసింది. ఇంతకాలం ఎడమొహం, పెడమొహంగా ఉన్న విపక్షాలు బెంగళూరు వేదికగా చేతులు కలిపాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చర్చకు కారణమయ్యారు. ప్రతిపక్ష కూటమికి తనని ఛైర్మన్‌ని చేస్తే పార్లమెంట్ ఎన్నికల ఖర్చు భరిస్తానని చెప్పినట్లు సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ వెల్లడించారు. దీంతో నిజంగానే కేసీఆర్ దగ్గర అంత డబ్బుందా అనే చర్చ మొదలైంది.