Home » Tag » ott platform
ఈ అందాల భామ ఆకాంక్ష రంజన్ కపూర్. బాలీవుడ్ బుల్లితెర నటి. ప్రస్తుతం దోషి, మోనికా ఓ మై డార్లింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ తన ప్రతిభను చాటుకున్నారు.
పెట్టుబడికి దాదాపు 20 రెట్లు వసూళ్లు సాధించిన చిత్రమిది. ఇంతటి ఘన విజయం సాధించిన చిత్రానికి ఇప్పుడు ఓటీటీ బిజినెస్ పూర్తి కావడం లేదు. ఈ సినిమాలోని వివాదస్పద కంటెంటే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.
ఆదిపురుష్ కి ఆదినుంచే కష్టాలు తప్పట్లేదు. అప్పుడేమో టీజర్ వచ్చీరాగానే బాలేదన్నారు. అతి కష్టం మీద గ్రాఫిక్స్ కి రిపేర్లు చేశాక జనాల అభిప్రాయాలు మారాయి. ఇప్పుడు అడ్వాన్స్ బుక్కింగ్స్ బాగున్నా, ఆదిపురుష్ కి కష్టాలు తప్పలా లేవు. ఆదిలోనే అడ్డంకులు పెరగక తప్పేలా లేవు.
ఒకప్పుడు సినిమా థియేటర్లోకి వెళ్లి చూడాలంటే రూ.200 ఉంటే సరిపోయేది. కుటుంబంలోని నలుగురు సభ్యులు కలిసి వినోదాన్ని ఆస్వాధించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏదైనా చిత్రాన్ని కుటుంబ సమేతంగా వెళ్లి తెరపై చూడాలంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఈ డబ్బుతో నెలలో ఒకవారం తిండి జరిగిపోతుందన్నమాట. అలాంటి వినోదం ఇప్పుడు అరగంట పాటూ ఒక్క రూపాయికే అందిస్తే చాలా ఆనందంగా వెళ్లి చూసేస్తారు. అందుకే ఒక్క రూపాయికే వినోదాన్ని అందించేందుకు పివిఆర్ సంస్థ నడుం బిగించింది.
అందరివాడు.. అజాతశత్రువు అనిపించుకున్న వెంకటేశ్ ఇమేజ్ను రానా నాయుడు వెబ్ సిరీస్ డ్యామేజ్ చేసింది. ఫ్యామిలీ హీరోపై మచ్చ పడింది. రానా నాయుడులో అసభ్యకర సన్నివేశాలు తీసేయాలని విజయశాంతి డిమాండ్చేసింది. ఒకరేంటి అందరి విమర్శలు వెంకీపైనే. కానీ.. వీటన్నింటికి వెంకటేశ్ సమాధానం ఇవ్వాలనుకోవడం లేదు. ఎందుకు కామ్‌గా వున్నాడు? ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు వెంకటేశ్ వెబ్ సిరీస్‌లో నటించిన భలే అప్డేట్ అయ్యాడని మెచ్చుకున్నారు.
నెట్ ఫ్లిక్స్ వేదికపై రానానాయుడు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీనిపై కొందరి అభిమానుల నుంచి విమర్శలు వినిపించడంతో రానా క్షమాపణలు చెప్పారు.
ఇటీవలె కాలంలో ఓటీటీ వేదికగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్ని పాజిటివ్ టాక్ సంపాధించుకుంటుంటే, మరికొన్ని చెత్త టాక్ సంపాధించుకుంటున్నాయి.