Home » Tag » Palakurthi
అత్త.. ఝాన్సీ రెడ్డి. ఆమె కోడలు యశస్వినీ రెడ్డి. సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడంతో కోడలికి అవకాశం ఇచ్చి ఆమెను ఎమ్మెల్యే చేశారు ఝాన్సీరెడ్డి. కోడలు ఎమ్మెల్యే అయ్యాక అత్తగారి పెత్తనం చేస్తానంటే కుదురుతుందా..?
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ
తెలంగాణలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఈమె.. ఎన్నికల సమయంలో పాలకుర్తి ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే పాలకుర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. దాని ద్వారా చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామంటూ చెప్పారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. వయస్సు పరంగా పిన్న వయస్కురాలు కావడమే కాదు.. ఆమెకు రాజకీయంగానూ ఎలాంటి అనుభవం లేదు.
అక్టోబర్ 4నే ఆమె పౌరసత్వాన్ని నిరాకరిస్తూ అధికారిక లేఖ విడుదల చేశారు. ఐనా సరే పాలకుర్తిలో పోటీ చేస్తానంటూ ఝాన్సీ రెడ్డి ప్రకటించడం కొత్త చర్చకు కారణం అవుతోంది. తొర్రూరు మండలం చెర్లపాలెం సహా పలు ప్రాంతాల్లో ఝాన్సీరెడ్డి స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లకు చేరువయ్యారు.