Home » Tag » Pandemic
ప్రస్తుతం భూతాపం, వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్‌లో మంచు కరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు భారీ స్థాయిలో కరిగిపోతోంది. దీనివల్ల మంచులో వేల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిన వైరస్లు బయటికొచ్చే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ కోరలు చాస్తోంది. చూస్తుండగానే పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లల్లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్లో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు డాక్టర్లు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది.
కరోనా ఈ పేరు వినగానే మనకు టక్కున.. ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణీ పాట గుర్తుకు వస్తుంది. అదేంటంటారా.. ఇదిగో ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇండియాకు వచ్చింది మాయదారి రోగము.. అన్నట్లుగా.. పుట్టిందేమో చైనా.. దాని పంజా మాత్రం పక్క దేశాలకు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది.
కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని, ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
పదేళ్లలో కరోనా వైరస్ లాంటి మరో వైరస్ రాబోతోందనే భయంకరమైన వార్త చెప్పింది ఓ రీసెర్చ్ ఆర్గనైజేషన్. లండన్‌లోని ఎయిర్ఫినిటీ లిమిటెడ్ అనే రీసెర్చ్ ఆర్గనైజేషన్ రీసెంట్గా కొన్ని రీసెర్చ్‌లు, సర్వేలు నిర్వహించింది.
కరోనా అవుట్‌బ్రేక్ ఇండియాను మరోసారి షేక్ చేస్తోంది. కంట్రోల్ లేకుండా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రెండు వారాల మందు వరకూ వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 10 వేల 158 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజెంట్ ఇండియాలో ఉన్న యాక్టివ్ కరోనా కేసుల కౌంట్ 44 వేల 998కి చేరింది. రికార్డ్ స్థాయిలో ఒకే రోజు 19 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. నిన్న కూడా సుమారు 7 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి.