Home » Tag » Patancheru
కారు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ఆమె ప్రయాణించడమే ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే... ముందు సీటుకు నందిత వేగంగా ఢీకొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ (ORR) పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో లాస్య అక్కడిక్కడే చనిపోయారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో ఒక పోరాటం ఆదిలాబాద్‌లో సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను రీ ఓపెన్ చేయాలని కొందరు పోరాటం చేశారు. దాన్ని బీఆర్ఎస్ నడిపించిందట. తాజాగా రైల్వే లైన్ కోసం రిలే దీక్షలు ప్రారంభించడంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారట.
మహిపాల్ వ్యూహాలకు ప్రత్యర్థి పార్టీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నాయ్. ఆయన రాజకీయ చతురతకు.. జనాల నుంచి వస్తున్న స్పందన తోడు కావడంతో.. వార్ వన్‌సైడ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మహిపాల్ రెడ్డి.. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉంటారనే పేరు ఉంది.
పఠాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ముందు నుంచీ అక్కడ టికెట్ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఆయన అనుచరులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటినే ముట్టడించారు.
పటాన్చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధుకు.. బీఆర్ఎస్ నుంటి టికెట్ దక్కలేదు. దీంతో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు మధు. అప్పటి నుంచి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడ్డాయ్. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీతో సహా అన్ని పార్టీలు టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయ్.
దుబ్బాకలో ఓ వర్గం ఎప్పటి నుంచో రఘునందన్ రావును వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు రఘునందన్ రావును అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి రఘునందన్ రావుకు దుబ్బాక టికెట్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు.