Home » Tag » Patnam Mahender Reddy
ఏ సమస్య వచ్చినా నాతో చెప్పుకోండి... నెనెప్పుడూ మీకు అందుబాటులో ఉంటా అంటున్నారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి.
తెలంగాణలో గులాబీ పార్టీ లీడర్లను కాంగ్రెస్ (Congress) లో చేర్చుకోవడం అంత ఈజీ కాదని అనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల నాటికి ఎక్కువ మంది BRS లీడర్లను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
తెలంగాణలో రాజకీయ (Telangana Politics) పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections), అధికార మార్పిడి తర్వాత జంపింగ్ జపాంగ్‌ల జోరు పెరుగుతోంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు అన్న పద్యాన్ని నరనరానా జీర్ణించుకున్న నాయకులు... పవరున్న పార్టీవైపు పరుగులు పెడుతున్నారు. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి.
తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు మళ్లీ బయటపడ్డాయ్. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష.. రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడ్డారా..? గత ఎన్నికల సమయంలో ఉన్నంత ధీమాగా ఇప్పుడు లేరా..? ఆయన చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఆందోళనను చెప్పకనే చెబుతున్నాయా..? కచ్చితంగా అవుననే చెప్పాలి.
రెండు, మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, మంత్రివర్గంలో మరీ భారీ మార్పులేమీ చేయకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు మంత్రిత్వ శాఖల మార్పు ఉండొచ్చు. దీంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పట్నం మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది.
తాండూరు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎన్నికల సమయానికి అవి ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి మీడియాకు వస్తున్న లీక్స్ లోని సమాచారాన్ని బట్టి తాండూరు టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే ఇస్తారని తెలుస్తోంది.
మరో వారంలోనే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణా రావు ఆ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత మంది నేతలు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.