Home » Tag » pavan kalyan
మొన్నటిదాకా వైసీపీలో ఉండి... పదవుల కోసం వెంపర్లాడుతూ... పవన్ కల్యాణ్ ని కూడా లెక్కచేయలేదు. అధికారాంతమున అన్నట్టుగా... వైసీపీ పవర్ ఊడిపోవడంతో అలీ కూడా ఆ పార్టీ నుంచి బయటపడ్డాడు. అప్పట్లో జగన్ ఆదేశిస్తే పవన్ మీద కూడా పోటీకి సిద్ధమన్న అలీ... ఇప్పుడు పవర్ స్టార్ ముద్దు అంటున్నాడు
ఆంధ్రప్రదేశ్ జనం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. సంక్షేమానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ... వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేశారు. నవ్యాంధ్రకు మరోసారి సీఎం కాబోతున్న చంద్రబాబు నాయుడిపై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న చాలా సవాళ్ళు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని రకాల సమస్యలను ఏపీ ఫేస్ చేయాల్సి వస్తే... ఇప్పుడు అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏపీలో ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారు. ? అసలు ఏపీ ముందున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం.
జనసేనకు ఇక గుర్తు కష్టాలు తీరినట్టే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గాజు గ్లాస్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పినట్టే. 2024 ఎన్నికలు పవన్ పార్టీని కష్టాల నుంచి గట్టున పడేసినట్టే అంటున్నారు. జనసేన ఇక నమోదైన పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీ హోదా పొందబోతోంది
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఆసక్తి.. పిఠాపురం నియోజకవర్గం మీదే ! పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఇంట్రస్ట్ అంతా ఇక్కడే కనిపిస్తోంది
ఏపీలో ఒక పల్లెటూరి ఇది. పోలింగ్ అయ్యాక కనిపించిన దృశ్యం ఇది. వందల మంది ఆటవికంగా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ... కర్రలతో కొట్టుకుంటున్నారు. మగాళ్ళకి ఆడాళ్లు కర్రలు , రాళ్లు అందిస్తున్నారు. ఒకరిని మరొకరు చంపాలంటూ అరుస్తున్నారు. ఈ దృశ్యం ఒక్క గ్రామంలోనిదే కాదు.... తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిపించింది. ఈ సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గంటకు 14 లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్లిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి స్వీడన్ లో సేద తీరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. షర్మిల కూడా అమెరికా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళారు. ఎమ్మెల్యేలు, చిన్నా చితకా నేతలు కూడా యూరప్ పర్యటనలో ఉన్నారు. ఇంకొందరు బాలి ద్వీపం వెళ్లి అక్కడ రక రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. మరికొందరు స్విట్జర్లాండ్, బ్యాంకాక్ తోపాటు మరికొన్ని విహార ప్రాంతాల్లో సేద తీరుతున్నారు.
పోలీసుల భద్రతా వైఫల్యంపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలంటూ ECకి కూడా మెస్సేజ్ ట్యాగ్ చేశారు పవన్ కల్యాణ్. సీఎంపై గులకరాయితో దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యాలకు కారణమైన వాళ్ళతో ఎలా విచారణ చేయిస్తారని ప్రశ్నించారు జనసేనానికి పవన్ కల్యాణ్.
జనసేనాని పవన్ కల్యాణ్ కి ఏమైంది... మూడు రోజుల పిఠాపురంలోనే పర్యటిస్తా.... అక్కడే మకాం పెడతా... నియోజకవర్గాన్ని చుట్టేస్తా అని చెప్పారు...... కానీ జ్వరం వచ్చిందంటూ... సాయంత్రానికి హెలికాప్టర్ ఎక్కి చలో హైదరాబాద్ అన్నారు. జనసేన ఎన్నికల ప్రచారం కోసం ఏప్రిల్ 2 దాకా పిఠాపురంలోనే ఉండాల్సిన పవన్... ఏదో మచ్చుకు వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. పిఠాపురం- హైదరాబాద్ డైలీ సర్వీస్ చేస్తున్నారు.
రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని జనసేన పార్టీ పెట్టారు పవన్. కానీ పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కల్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నారు. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు రెడీ చేయాలన్నది పవన్ టార్గెట్.
మొన్నటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను...జనసేన పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తానని చెప్పిన నాగబాబు... ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో రివ్యూలు నిర్వహిస్తుండటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.
ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. అటు వైసిపి ఇటు జనసేన, టిడిపి ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. మొత్తం రాష్ట్ర రాజకీయంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే... జనసేన టార్గెట్ ఎవరు? జన సైనికులు లక్ష్యంగా చేసుకొని ఈ ఎన్నికల్లో ఎవరిపై తమ ప్రతాపం చూపిస్తారు.? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.