Home » Tag » Paytm app
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (Reserve Bank of India) కండీషన్లతో పుట్టెడు కష్టాల్లో ఉన్న పేటీఎం ఇప్పుడు తన వాలెట్ బిజినెస్ (Wallet Business) ను అమ్ముకోవాలని నిర్ణయించింది. పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Communications Limited) తన వాలెట్ బిజినెస్ ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి లేదంటే HDFC బ్యాంక్ కు అమ్మడానికి చర్చలు జరుపుతోంది.
పేమెంట్స్ బ్యాంక్ ను క్లోజ్ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) ఆదేశాలతో పేటీఎం షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వన్ 97 కమ్యూనికేషన్ షేర్లు పడిపోయాయి. షేర్ల విలువ దాదాపు 50శాతానికి పడిపోవడంతో 20 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడిదారులు నష్టపోయారు.
ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలకు ఆర్బీఐ అనుమతించింది. ఆ తర్వాత నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవడం చేయొద్దని, నగదు లావాదేవీలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది