Home » Tag » PCB
భారత్ తో మ్యాచ్ అనగానే పాక్ క్రికెటర్లు ఓవరాక్షన్ చేస్తుంటారు... సీనియర్లే కాదు ఏ జట్టు ఆటగాళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. తాజాగా ఎమర్జింగ్ ఆసియాకప్ లో భాగంగా భారత్ మ్యాచ్ జరిగినప్పుడు యువ బౌలర్ ముఖీమ్ ఓవరాక్షన్ చేశాడు.
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కిందా మీదా పడుతోంది. నిధులను ఏదో విధంగా సమకూర్చుకుని స్టేడియాలను ఆధునీకరిస్తూ టోర్నీని గ్రాండ్ గా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే స్టేడియాల మరమ్మత్తు పనులను కూడా ప్రారంభించింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చేలా కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, పీసీబీ అధ్యక్షుడు జాక్ అష్రఫ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కేసు పాకిస్థాన్ క్రికెట్లో పెను దుమారం రేపడమే కాకుండా రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డు ప్రెసిడెంట్ జాక్ అష్రాఫ్ ఈ చర్యపై పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కమ్రాన్ అక్మల్ సోదరుడైన ఉమ్రాన్ అక్మల్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్కు గొప్ప బ్యాటర్ దొరికాడంటూ అప్పట్లో ప్రచారం ఒక రేంజ్లో జరిగింది. అయితే 2020లో ఫిక్సింగ్ కోసం బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని దాచడంతో ఆగ్రహించిన పీసీబీ ఉమ్రాన్పై 3 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది.
ఆసియా కప్లో భాగంగా ముల్తాన్లో పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జేషాకు పీసీబీ ఆహ్వానం పంపింది. షాతో పాటు, ఏసీసీలో భాగమైన ఇతర బోర్డు సభ్యులను కూడా ఆహ్వానించినట్లు పీసీబీ తెలిపింది.
పాకిస్తాన్లో జరగాల్సిన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ బెట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ తర్వాత ప్రపంచ కప్ జరుగుతుంది. ఇండియాలో జరిగే ప్రపంచ కప్లో పాక్ పాల్గొంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో ఆడేందుకు రోజుకో కొర్రీ పెడుతూ అసలు ఆడతారో లేదో స్పష్టంగా చెప్పకుండా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై బీసీసీఐ, ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
పాక్ వెళ్లేందుకు ఇండియా సిద్ధంగా లేదు. మరోవైపు బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ కూడా పాక్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా బీసీసీఐ సూచన మేరకు ఆసియా కప్ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ, ఏసీసీ భావిస్తున్నాయి.