Home » Tag » Perishable Goods
దేశం అంటే ఏంటి ? కొన్ని సరిహద్దుల పరిధిలో ఉండే భూభాగం మాత్రమేనా ? కాదు..దేశమంటే ప్రజల అస్థిత్వం.. దేశమంటే సంస్కృతి , సంప్రదాయాల వారసత్వం.. ఒక దేశమంటే ప్రజల జీవన విధానం.. అన్నింటికీ మించి మన గురజాడ చెప్పినట్టు దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. కానీ శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక దేశం తన అస్థిత్వాన్ని కోల్పోయి.. మట్టిగా మిగిలిపోతే.. మానవ నాగరికతకు భవిష్యత్తుకు అర్థం లేకుండా చేసి ఎడారిగా మారిపోతే.. కళ్ల ముందు అలాంటి సంక్షోభాన్ని మనం ఊహించగలమా..? ఊహించడం కాదు చూడాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. త్వరలోనే మన కళ్ల ముందే.. స్పెయిన్ దేశం పూర్తిగా ఎడారిగా మారిపోబోతోంది. ఇప్పటికే 75 శాతం స్పెయిన్ ఎడారిని తలపిస్తోంది. రానున్న రోజుల్లో పూర్తిగా ఎడారిగా మారి తన అస్థిత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదపుటంచుల్లో ఉంది స్పెయిన్.