Home » Tag » petition
సినిమాలో మ్యాటర్ ఉందో లేదో కానీ.. మళ్లీ పెళ్లి గురించి పెరుగుతున్న హీట్ మాత్రం అంతా ఇంతా కాదు. పవిత్రను త్వరలో పెళ్లిచేసుకోబోతున్నానని ప్రకటించిన నరేష్.. ఎక్కడికి వెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు.
సుప్రీం కోర్టు అంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. ఇది ఏదైతే తీర్పు ఇస్తుందో అది చట్టం అయి కూర్చుంటుంది. దీనిని దిక్కరించే అధికారం ఎవరికీ ఉండదు. గతంలో పాలకులకు తగ్గట్టుగా తీర్పులు వస్తున్నాయన్న అభియోగాలు న్యాయస్థానాలపై ఉండేవి. అందుకే కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగేలా ఒక కమిటీని నియమించారు. దీని ప్రకారం కేవలం ఒక్కరే నిర్ణయం తీసుకోకుండా కమిటీలో సగం పైగా సభ్యులు ఆమోదిస్తేనే అది తీర్పు వెలువరించేందుకు వీలుంటుంది. ఇలాంటి అత్యున్నత న్యాయస్థానం గతంలో అనేక సంచలనమైన తీర్పులనే ఇచ్చింది. వివాహేతర సంబంధాల విషయంలో కావచ్చు. విద్య విషయంలో కావచ్చు. స్త్రీ హక్కుల విషయంలో కావచ్చు. ట్రాన్స్ జెండర్స్ విషయంలో కావచ్చు. ఇలా పరిస్థితులకు అనుగుణంగా రకరకాల తీర్పులను వెలువరించింది. ఇప్పుడు తాజాగా మరో సంచలనమైన పిటిషన్ ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. అదే స్వలింగ వివాహానికి సంబంధించిన పిటీషన్. దీనిని ప్రస్తుతం తోసిపుచ్చకుండా స్వీకరించడం అయితే జరిగింది. దీనిపై తదుపరి వాయిదాను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అసలు దీనిపై విచారణ జరుపవచ్చా లేదా అనే అంశం గురించి ఒక్కసారి లోతుగా చర్చించుకుందాం.