Home » Tag » Phone Tapping Case
పార్లమెంట్ రిజల్ట్ (Parliament Result) తరువాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఉండదా ? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. ఇప్పుడు మంచి ఆఫర్ చూసుకుని వెళ్లిపోవడం బెటరా ?
KCR హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) BRS నేతల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటి దాకా మొత్తం 10 మంది గులాబీ నేతలు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్నట్టు పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) గుర్తించారు.
తెలంగాణలో సంచలన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును (Phone Tapping Case) టెలిగ్రాఫ్ చట్టం (Telegraph Act) కింద నిరూపించగలరా ? అందుకు తగినన్ని ఆధారాలను పోలీసులు సేకరించారా ? ఇప్పటిదాకా ఈ చట్టం గురించి FIR లో రాయకపోవడానికి కారణం ఏంటి ? మాజీ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి ?
ఫోన్ ట్యాపింగ్ ద్వారానే, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70లక్షలు సీజ్ చేశారు. మునుగోడు ఎన్నికలో కోమటిరెడ్డి డబ్బులు రూ.3.5కోట్లు, దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌తోపాటు కుటుంబ సభ్యుల ఫోన్లు, కొందరు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు.