Home » Tag » pinnelli
నరసరావుపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి విడదల రజిని మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒకమాట ఎన్నికల తర్వాత మరో మాటలా ఉందని మండిపడ్డారు.
ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ అధికారుల బృందం నివేదికను ఈసీకి సమర్పించింది. ఈ కేసుల్లో ఎక్కువగా వైసీపీ నేతల ప్రమేయం ఉండటంతో... వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశాలున్నాయి. దాంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.
ఏపీలోని పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పాలవాయి గేటులో EVM ధ్వంసం చేయడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై క్రిమినల్ చర్యలతో పాటు... మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. హౌస్ అరెస్ట్ నుంచి పిన్నెల్లి తప్పించుకుపోయినా... పట్టించుకోని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ లీడర్లు.