Home » Tag » Political Strategys
తెలంగాణలో ఎన్నికల హడావుడి పీక్స్‌కు చేరింది. జంపింగ్ జపాంగ్‌లు.. కండువాల మార్పులు.. మాములుగా లేదు రాజకీయం ఇక్కడ. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ మరింత జోష్ మీద కనిపిస్తోంది. పొంగులేటి చేరికతో.. ఆ జోష్ మరింత రెట్టింపు అయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందన్నసంగతి ఎలా ఉన్నా.. రేవంత్ రెడ్డికి అసలైన ప్రమాదం ముంచుకు రాబోతోందా.. అదీ పొంగులేటి రూపంలోనే రాబోతోందా అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే కనిపిస్తున్నాయ్. నిన్న కర్ణాటకలో విజయం.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తున్న జోష్.. హస్తం పార్టీ దూకుడు మంత్రం పఠించేలా చేస్తోంది. దీనికితోడు సర్వేలు కూడా అనుకూలంగా వినిపిస్తున్నాయ్. తెలంగాణ కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయనే సర్వే నివేదికలతో.. ఆ పార్టీ అధిష్టానం అప్రమత్తం అయింది.
ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది ఏపీ రాజకీయం. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ విషయం వివాదంగా మారి రాజకీయాన్ని మలుపు తిప్పుతుందో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీన్ మరింత మారింది. వివేకా కేసులో వైఎస్ కుటుంబం చుట్టూ అల్లుకుంటున్న ఉచ్చు.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించాయి. వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. పక్కా క్లారిటీతో అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాలు, పవన్‌తో చంద్రబాబు మీటింగ్.. ఇలాంటి పరిణామాలన్నీ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి.