Home » Tag » Ponguleti Srinivasa Reddy
బీఆర్ఎస్, బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో జోష్ మాములుగా లేదు. ఐతే కాంగ్రెస్ మరో మూడు స్థానాల్లో అభ్యర్దులను బ్యాలెన్స్ పెట్టింది. అందులో కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయ్.
ముబిన్ అనే స్మగ్లర్.. హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్‌లు తెప్పించాడు. పటెక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్ లగ్జరీ వాచ్‌లను హర్ష ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు ముబిన్.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పొంగులేటి.. తెలంగాణ ఏకనాథ్ షిండే అవుతారంటూ.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. ఐతే దీనికి పొంగులేటి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తాను సీఎం అంటూ వస్తున్న కథనాలన్నీ ఊహాజనితం అంటూ కొట్టిపారేశారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల్లో నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాల్లో దరఖాస్తుల్ని స్వీకరించబోతున్నట్లు పొంగులేటి మీడియాకు వెల్లడించారు.
2018 ఎన్నికలలో కాంగ్రెస్ తరపున కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కారు పార్టీలోకి వెళ్లారు. ఈసారి ఆయనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
పంచాయితీలకు కేరాఫ్ అనిపిస్తుంటుంది కాంగ్రెస్. అది జూనియర్లు వర్సెస్ సీనియర్లు కావొచ్చు.. ఇప్పుడు టికెట్ల లొల్లి కావొచ్చు. రచ్చ లేకుండా ఏ కార్యం ముగియదు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి హస్తం పార్టీలో ..! ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. మొదటి జాబితాలో 70 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయం కంటే.. ఖమ్మం లో ఎవరు ఎక్కడ అన్న దాని మీద ఆసక్తి కనిపిస్తోంది రాజకీయ వర్గాల్లో ! ముఖ్యంగా తుమ్మల, పొంగులేటి విషయంలో ఆ క్యూరియాసిటీ కాస్త పీక్స్‌కు చేరింది.
ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి అప్పగించేందుకు హస్తం పార్టీ సిద్ధం అయిందనే టాక్ వినిపిస్తోంది. ఐతే అదే కొత్తగూడెం స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన పెట్టిన కండిషన్ కూడా ఇదే..!
పొంగులేటికి హామీ ఇచ్చినట్లు.. ఆయన అనుచరులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు ఏకంగా పొంగులేటి సీటుకే కాంగ్రెస్ ఎసరు పెట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది.
టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పక్క చూపులు చూస్తుండటంతో కేసీఆర్‌లో రోజు రోజుకూ టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఖమ్మం జిల్లా మీద దాదాపు ఆశలు వదులుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మరో కీలక నేత మైనంపల్లి హనుమంతరావు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు.
పొంగులేటి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు గులాబీ బాస్.. ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావును బీఆర్ఎస్ వైపు ఆకర్షించారు. కేటిఆర్ సమక్షంలో తెల్లం వెంకట్రావ్ గులాబీ కండువా కప్పుపున్నారు. ఇది పొంగులేటికి భారీ షాక్ అనే చెప్పాలి.