Home » Tag » Ponnam Prabhakar
నేటి నుంచి బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభంమయ్యాయి. ఆదివారం లంగర్‌హౌజ్ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి.
తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా.. ఇదేమైనా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనుకున్నారా అని ప్రశ్నించారు కోమటి రెడ్డి.
తెలంగాణలో 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ గుట్టు చప్పుడు కాకుండా లిస్ట్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే అధికారిక ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. మార్చి 14న లిస్ట్ రిలీజ్ అయినా.. 16 రాత్రి వరకూ బయట పెట్టలేదు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. నేటి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కుల గణన చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు కొన్ని అనుమానాలు వచ్చే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
దాదాపు కోటిన్నర విలువైన కారులో మరో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మేడారం వెళ్లారు. ఐతే ఎన్నికల ముందు వేరే కారులో తిరిగిన పొన్నం ప్రభాకర్.. ఈ కొత్త కారు ఎప్పుడు కొన్నారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
వేడుకల్లో భాగంగా ఓ ఎమ్మెల్యే చేసిన చిలిపి పని.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఇరుకున పడేసింది. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించిన ఓ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత అయిన పొన్నం ప్రభాకర్ కు ఉన్న పార్టీ విధేయతను చూసి.. ఆయనకు మంత్రిగా ఛాన్స్ ఇచ్చింది హైకమాండ్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ప్రమాణం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగానే కాకుండా.. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నో పదవులను నిర్వహించారు పొన్నం.
కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ టికెట్ కోసం పోటీ పడ్డారు. ఐతే అధిష్టానం మాత్రం పొన్నం ప్రభాకర్‌కే టికెట్ కేటాయించింది. దీంతో అలిగిరెడ్డి వర్గం అలిగింది. తీవ్రంగా రియాక్ట్ అయింది. నాన్ లోకల్ వ్యక్తులకు ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నిస్తోంది.
ఉద్యమంలో పదవులు త్యాగం చేసిన వారు.. తెలంగాణలో కాంగ్రెస్‌కు పిల్లర్లాంటి వాళ్లు అనుకున్న నేతలకు ఫస్ట్ లిస్ట్‌లో అవకాశం దక్కలేదు. తొలి జాబితాలో సీటు దక్కని వారిలో సీనియర్ నేతలు మధుయాష్కీ, షబ్బీర్ అలీ, మహేష్‌కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.