Home » Tag » POPULATION
జనాభాలో ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది భారత్. చైనా సెకండ్ ప్లేస్‌కు పడపోయింది. జనాభా పెరగడంతో నష్టాల కంటే లాభాలే ఎక్కువ. పెరిగిన జనాభాలో యువకుల శాతమే ఎక్కువ. ఏ దేశానికి లేని యువశక్తి భారత్ సొంతం. అంటే వర్క్ ఫోర్స్ ఎక్కువ మనకి ! కోట్లకు కోట్లు ఖర్చు చేసినా.. ఏ దేశం కొనలేని బలం ఇది. అలాంటిది ఇదే జనాభాను కారణం చూపిస్తూ.. జర్మనీలో వంకర రాతలు రాసిందో పత్రిక.
పాపులేషన్లో ఇండియా నెంబర్ వన్ పొజిషన్‌కు రీచ్ అయ్యింది. ఇప్పటి వరకూ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న చైనాను సెకండ్ ప్లేస్‌కు నెట్టేసింది. రీసెంట్ కౌంట్ ప్రకారం ఇండియన్ పాపులేషన్ 142 కోట్ల 86 లక్షలు. ఇండియా నెంబర్ వన్‌లో ఉంది సరే.. కానీ కనీసం లక్ష మంది ప్రజలు కూడా లేని చాలా దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. వాటికన్ సిటీ వరల్డ్‌లోనే అన్నిటికంటే చాలా చిన్న దేశం ఇక్కడ ఓన్లీ 518 మంది మాత్రమే నివసిస్తున్నారు.
కొట్టేశాం.. చైనాను వెనక్కు నెట్టేశాం..! భారతీయులంతా కాలరెగరేసుకు తిరగండి.. గర్వంగా చెప్పుకోండి.. ఇంతకీ మనం ఎందులో చైనాను కొట్టేశాం అంటారా.? జనాభాలో..అవును తాజా లెక్కల ప్రకారం చైనా జనాభాను మనం దాటిపోయాం. ప్రపంచ జనాభాలో ఇప్పుడు మనమే నెంబర్ వన్. ఇప్పట్లో మనల్ని కొట్టేవారు లేరు. రారు. ప్రస్తుతం భారత జనాభా 142.86కోట్లు... చైనాకంటే మన జనాభా 29లక్షలు అధికం..ప్రపంచ జనాభాలో ఐదోవంతు భారత్‌లోనే ఉంది.
ప్రపంచానికి ఏమైంది. ఒకవైపు జనాభా తగ్గిపోతుందని ఆందోళన చెందుతుంది చైనా. మరోవైపు యువకుల సంఖ్య తక్కువగా ఉందని ఇబ్బంది పడుతోంది జపాన్. ఇప్పుడు ఈరెండింటి స్థానంలోకి ముచ్చటగా మూడో దేశం వచ్చి చేరింది. అయితే దీని సమస్య కొంచం ఇంచు మించు ఇలాంటిదే అయినప్పటికీ ఈ రెండింటికి భిన్నంగా ఉంటుంది. అదే పెళ్లి చేసుకునే వారి వయసు 30కి పైన ఉండటం. గతంలో చైనా, జపాన్ ల సమస్యను చూశాం. ఇప్పుడు దక్షిణ కొరియా సంగతేంటో చూద్దాం. ఎందుకిలా అయ్యిందో వివరంగా తెలుసుకుందాం.
ప్రపంచంలో మంచి ఖ్యాతి గణించిన దేశాలకు ఏమైంది. నిన్నటి వరకూ చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు అదే పరిస్థితి జపాన్ ఎదుర్కోంటోంది. దీనివల్ల దేశంలో పరిస్థితి అతలాకుతం అవుతోంది. భవిష్యత్ మీద ఆశ సన్నగిల్లుతోంది. జపాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. దీనికి ముఖ్యకారణాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.