Home » Tag » Power Politics
తెలంగాణలో గులాబీ, కమలం కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలసి పోటీ చేస్తే..ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. ఆ దిశగా చర్చలు ప్రారంభం కావొచ్చు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) తో కయ్యం పెట్టుకోవడం కన్నా... ఏదో ఒక పార్టీతో నెయ్యమే మంచిదని బీఆర్ఎస్ పెద్దలు డిసైడ్ అయ్యారు తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారంలో విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ మధ్య రచ్చకు దారితీస్తోంది. తెలంగాణలో విద్యుత్ సప్లయ్ కి భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక (Karnataka) లో ఏం వెలగబెడుతుందో గమనించాలని BRS కోరుతోంది. కర్ణాటకలో రైతులకు 5 గంటల పవర్ ఇవ్వడానికి దిక్కులేదని.. తెలంగాణలో ఎలా సాధ్యమవుతుందని BRS చీఫ్ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అయితే.. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని కోరుతున్నారు. ఇదే టైమ్ లో కర్ణాటకలో జేడీఎస్ అధినేత కుమార స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ ని ఇరాకటంలోని నెట్టాయి.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు. మూడు నెలల వ్యవధిలో నాలుగోసారి. నాయకులతో తరచూ సంప్రదింపులు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితి ఏంటి? పార్టీ ఆడాలనుకుంటున్న సింపతీ గేమ్ వర్కౌట్ అవుతోందా? లీడర్స్ అనుకున్న రేంజ్లో సానుభూతి వెల్లువెత్తుతోందా? నాయకుల మనసులో ఉన్నదేంటి? చంద్రబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నదేంటి? అసలు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం గ్రాఫ్ పెరిగిందా? రాష్ట్రం లో చాలా మంది ఇదే చర్చించుకుంటున్నారు.
ఆవిర్భావ వేడుకల తర్వాత ట్వీట్లకే పరిమితం అయిన పవన్.. చాలా గ్యాప్ తర్వాత ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రులు చేస్తున్న కామెంట్లను ఖండించారు. తెలంగాణ జనాలను ఏమైనా అంటే మాములుగా ఉండదు మరి అని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడే జనాలకు కన్ఫ్యూజన్ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ఏపీ మీద కామెంట్లు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కోపం వచ్చింది. హరీష్, కేటీఆర్కు.. గట్టిగా కౌంటర్ ఇచ్చారు.