Home » Tag » prakasham barrage
11లక్షల క్యూసెక్కుల వరద నీరు మహా వేగంతో దూసుకొస్తుంది. ఆ నీటిలో కృష్ణానది ఒడ్డునున్న 5 భారీ బోట్లు అదే వేగంతో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్నాయి. అంతేకాదు బ్యారేజ్ గేట్లకు ఆ బోట్లు అడ్డం పడ్డాయి. ఐదారు టన్నుల బరువున్న నాలుగు బోట్లను బయటకు తీయడానికి 12రోజుల నుంచి ఆపరేషన్ జరుగుతుంది.
ప్రకాశం బ్యారేజ్ లో గేట్లకు అడ్డం పడిన బోట్లను వెలికితియటానికి నాలుగు కార్గో బోట్లను వినియోగిస్తున్నారు. నాలుగు అడుగుల మేర బోటు పైకి వచ్చింది.
ఆరు నుంచి ఏడు టన్నుల బరువు ఉండే యాంగ్లర్ లతో H ఆకారంలో ఒక స్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటారు.. ఆ H బ్లాక్ ను రెండు భారీ ఇసుక పడవల ను కలుపుతూ వెల్డింగ్ చేసుకుని అమరుస్తారు.. ఆ రెండు పడవల మధ్య మరో భారీ పడవను నడప గలిగేటంత దూరం ఉండేలా ఏర్పాటు చేస్తారు..
ప్రకాశం బ్యారేజ్ వద్ద కొట్టుకువచ్చిన పడవలను తొలగించేందుకు అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. నిన్న రెండు భారీ క్రేన్లను ప్రకాశం బ్యారేజ్ పై ఉంచి తొలగించాలని చూసినా అది సాధ్యం కాదు. రెండు గంటల పాటు ప్రయత్నం చేసినా సరే అంగుళం కూడా కదలలేదు ఒక్క బోటు కూడా.
ప్రకాశం బ్యారేజి వద్ద రెండోరోజు కూడా పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను ముక్కలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టడం వెనక కుట్ర కోణం ఉందా ? బోట్లతో ఢీకొట్టి బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయేలా చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలి అని ప్లాన్ చేశారా ? ఈ ప్రశ్నలన్నిటికీ పోలీసుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
ఇటీవల ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద వచ్చిన సమయంలో కొట్టుకు వచ్చిన పడవలపై ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీ కొట్టిన పడవుల యజమానుల ఆచూకీ కనుగొన్నారు పోలీసులు.
ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు ప్రారంభం అయ్యాయి. నిపుణుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు పనులు మొదలయ్యాయి.
ప్రకాశం బ్యారేజ్ కు వరద భారీగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12;30 గంటలకు 22 వేల క్యూసెక్కులు తగ్గి ప్రస్తుతం 8,42,208 క్యూసెక్కులుగా ఉంది.
ఎగువ నుంచి వస్తున్న వరదలతో ప్రకాశం బ్యారేజ్ కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 70 గేట్లు ఎత్తున అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.