Home » Tag » Prashanth Kishore
ఊరికే కలవరు మహానుభావులు అన్నట్లు.. పీకే, చంద్రబాబు మీటింగ్ ఏంటి.. ఎందుకు అనే అనుమానాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్. బిహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పీకే.. లోకేష్ పిలిపించి మరీ.. చంద్రబాబు ఆయనను ఎందుకు రప్పించారా అనే చర్చ ఇంకా వినిపిస్తూనే ఉంది.
అనూహ్యంగా ఏపీ ఎన్నికలకు మూడు నెలలు ముందు చంద్రబాబు నాయుడిని కలిశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ కలయికతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చిన్న కుదుపే వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించడం ఖాయం అయిపోయింది. 2019 ఎన్నికల్లో వైసిపికి వ్యూహకర్త గా వ్యవహరించి.. ఆ పార్టీ విజయానికి దోహదపడ్డారు పీకే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టనుందా..
జనాల్లోకి వెళ్లాలి.. వాళ్ల కష్టాలు వినాలి.. ఆ కష్టంలో భాగం అవ్వాలి.. నేనున్నాను నేను విన్నాను అని హామీ ఇవ్వాలి.. వాళ్ల మనసు గెలుచుకోవాలి. ఇదీ ఒకప్పటి రాజకీయం. రాజకీయ పార్టీలన్నీ ఇలానే చేసేవి గతంలో. కానీ ఇప్పుడు డబ్బు ఆడుతున్న ఆటలో రాజకీయం.. ఆ నోటు కిందే నలిగిపోతోంది. పార్టీలన్నీ ఇవే ఫాలో అవుతున్నాయ్. వ్యూహకర్తల మీదే భారం వేస్తూ.. వాళ్లకే ఎన్నికలు అప్పచెప్తున్నాయ్.