Home » Tag » PRIME MINISTER
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్..ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
అయోధ్య రాముడిని (Ayodhya Ram) బీజేపీ (BJP) ఎంత హైప్ చేసింది. రామాలయం నిర్మాణం దగ్గర నుంచి విగ్రహ ప్రతిష్ట... అంతకంటే ముందు బీజేపీ నేతలు... ఇంటింటికీ అక్షింతలు పంచడం... ఫోటోలను అందించడం.... బీజేపీ లేకపోతే రాముడు లేడు అన్నంత బిల్డప్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు.
ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ లో టీడీపీకి రెండు పదవులు దక్కాయి. ఇందులో కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు... డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. గుంటూరు పార్లమెంట్ సభ్యుడైన పెమ్మసాని... మొదటిసారి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఎన్నికల ముందే రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని... ఎవరూ ఊహించని విధంగా కేంద్ర మంత్రి పదవితో జాక్ పాట్ కొట్టారు.
ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి (Purandeshwari) ఈసారి మోడీ కేబినెట్ లో చోటు దక్కుతుందని అంతా ఆశించారు. ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందని కూడా టాక్ నడిచింది.
అయోధ్య రామ మందిరం.. ఈ పేరు తెలియని వారు భారతీయుడు ఉండడు. యావత్ ప్రపంచ భారతీయులందరు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. అది కూడా ఎప్పుడో కాదు.. మరి కొన్ని రోజుల్లోనే.. జరగబోతుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ తో స్వాగతం పలకగా.. ప్రధాని ముందుగా ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో ఇరు దేశాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్కడున్న భారతీయుల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వీరిని సురక్షితంగా ఇండియా ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమయ్యింది.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతీ కుండ్ ను ప్రధాని మోదీ దర్శించుకున్నారు. టిబెట్ లోని కైలాస పర్వతాన్ని పోలివున్న ఆది కైలాస పర్వతం సందర్శించారు ప్రధాని మోదీ.
జాతీయ రాజకీయాల్లో దేశ ప్రధాని అభ్యర్థి ఎవరు అనే దానిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేశారు.