Home » Tag » Prithvi Shah
మన దేశంలో క్రికెటర్ గా సక్సెస్ అయితే ఎంత లగ్జరీ లైఫ్ గడుపుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఐపీఎల్ వచ్చిన తర్వాత జాతీయ జట్టుకు ఆడకుండానే చాలా మంది యువ ఆటగాళ్ళు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు. యంగ్ స్టర్ గా ఉన్నప్పుడు వచ్చిన ఈ డబ్బు, లగ్జరీ లైఫ్ వాళ్ళను నేల మీద నిలవనివ్వదు.
టీమిండియా ఓపెనర్ (Team India Opener), ముంబై బ్యాటర్ (Mumbai Batter) పృథ్వీ షా (Prithvi Shah) రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా మెరుపు సెంచరీతో చెలరేగాడు.
ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ను మిక్సర్‌లో వేస్తే పృథ్వీ షా వచ్చాడంటూ పేరుగాంచాడు. అయితే, చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు.