Home » Tag » Priyanka Gandhi
వాయనాడ్ ఉప ఎన్నికల యుద్దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉప ఎన్నికల డేట్ ను కేంద్ర ఎన్నికల సంఘం గత మంగళవారం ప్రకటించగా... నవంబర్ 13న ఓటింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. వాయనాడ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కంటే అధికార బిజేపికి అత్యంత కీలకం.
ప్రకృతి అందాలకు నిలయమైన కేరళ (Kerala) లో ఇప్పుడు అదే ప్రకృతి విపత్తుతో (Natural disaster) మరణ మృదంగం మోగుతోంది. దేశం మొత్తం కేరళ ఈ విపత్తు నుంచి బయటకు రావాలని ప్రార్ధిస్తోంది. కేరళ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) కూడా వేగంగా చర్యలు చేపడుతూ బాధితులకు సహాయం చేస్తూ, బురదలో, రాళ్ళ కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు.
కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనతో కేరళ రాష్ట్రం (Kerala State) విలవిలలాడిపోతోంది. రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఓ పక్క ప్రతిపక్ష కూటమి, మరో పక్క బీజేపీ. అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు పోలింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే దేశానికి అధినేత ఎవరో తేలిపోతుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఇప్పటికే వయనాడ్ నుంచి పోటీ చేశారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీని రాయ్ బరేలీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఆమె ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి పోటీకి దిగుతారని గతంలో వార్తలు హల్చల్ చేశాయి.
వైఎస్ షర్మిల... ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 4న తన వైఎస్సార్ టీపీని హస్తం పార్టీలోకి విలీనం చేస్తారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల. అయితే ఆమెకు ఇప్పటికిప్పుడు ఏం పదవి ఇస్తారన్న దానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.
ఢిల్లీలో పొల్యూషన్ అంతకంతకూ పెరిగిపోతోంది. దాంతో ఆరోగ్యసమస్యలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ నేత సోనియాగాంధీ హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడి వాతావరణం బాగుండటంతో నెలలో కనీసం 15 రోజులైనా ఇక్కడే ఉండాలని భావిస్తున్నారు.
తెలంగాణ ఓటర్లు విజ్ఞతతో ఓట్లేయాలని కోరారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక. X (ట్విట్టర్ ) ద్వారా తెలుగులో ట్వీట్స్ చేశారు.
కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకి ఉద్యోగాలు వచ్చాయా..? పరీక్షలు పెడతారు. కానీ, పేపర్లు లీక్ చేస్తారు. కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి పాలన కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది.
పనిగంటలు పాటించకుండా ... రోజుకి 11 గంటల పాటు వర్క్ చేస్తున్నా తమ జీవితాలకు భద్రత లేకుండా పోయిందని అంటున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్ తమ గోడు చెప్పుకున్నారు.