Home » Tag » quash petition
మాజీ సీఎం హోదాలో ఉన్న తనను అరెస్టు చేసేటప్పుడు.. సీఐడీ అధికారులు సెక్షన్ 17Aను పాటించలేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ.. గతేడాది సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో తీర్పుపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుపై సుప్రీం కోర్టు తాజా నిర్ణయం వెల్లడించింది.
సీఐడీ తరఫు లాయర్ రోహత్గీ.. చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా వాదనలతో సుప్రీంకోర్టులో హాట్‌హాట్ వాతావరణం కనిపించింది. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు.. జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందన్నారు.
మంగళవారం విచారణ వాడీవేడిగా సాగింది. చంద్రబాబు తరఫున సుప్రీం సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సెక్షన్ 17ఏతోపాటు, ఇదే తరహా ఆరోపణలకు సంబంధించి కోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల గురించి తీవ్ర చర్చ జరిగింది.
స్కిల్ కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు.. ఇప్పటివరకు బెయిల్ కోసం కనీసం దరఖాస్తు చేసుకోలేదు. సుప్రీంకు వెళ్లి కూడా క్వాష్ పిటిషన్ మీద పట్టు పట్టారు. దీంతో చంద్రబాబు తీరుపై సామాన్యుల్లో కొత్త చర్చ జరుగుతోంది. ఇంతకీ క్వాష్ పిటిషన్ ఏంటి అనే డిస్కషన్ వినిపిస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని చంద్రబాబు కోరారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని, జ్యుడిషియల్ రిమాండ్ రద్దు చేయాలని, విచారణ నిలిపివేయాలని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు
శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో సీఐడీ తరఫు లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ఏకవాక్య తీర్పు వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు కస్టడీపై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడి కావాల్సి ఉంది.
క్వాష్ పిటిషన్‌కు సంబంధించి లిస్ట్ ఇంకా పెట్టలేదని, ఆ తర్వాతే వివరాలు చెప్పగలమని లాయర్లు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు జడ్జి.. క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్నందున సీఐడీ కస్టడీపై కూడా తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.