Home » Tag » Raghu Rama Krishna Raju
నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రఘురామ.. వైసీపీకి ఎదురు తిరిగి ఆ తర్వాత బీజేపీలో చేరాలనుకున్నారు. కమలం పార్టీ ఇచ్చిన ఝలక్‌తో ఫైనల్‌గా టీడీపీలో చేరారు. తనకు పార్టీలు పిలిచి సీటు ఇస్తాయని కలలు కన్న రఘురామకు బీజేపీ షాకిచ్చింది.
అనపర్తి టికెట్ టీడీపీకి ఇస్తే దానికి బదులుగా తంబల్లపల్లి లేదా ఏలూరు లేదా రాజంపేట టికెట్ కావాలని బీజేపి డిమాండ్ చేస్తోంది. దీనికి టీడీపీ నుంచి కూడా సుముఖత వ్యక్తమైనట్టు సమాచారం. దీంతో అనపర్తి విషయంలో దాదాపు లైన్ క్లియర్ అయ్యింది.
ఉండి స్థానంలో అభ్యర్థిని మార్చి.. రఘురామకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే.. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే టెన్షన్ కూడా టీడీపీని వెంటాడుతోంది.
తానే బరిలో ఉంటానని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పట్టుదలతో కనిపిస్తుంటే.. అవసరం అయితే రెబెల్‌గా బరిలోకి దిగుతానని శివరామరాజు.. చంద్రబాబు హామీతో టికెట్ తనదే అనే ధీమాతో రఘురామ రాజు.. ఇలా ముగ్గురు రాజులు ఉండి మీద పట్టిన పట్టు వీడకుండా ఉన్నారు.
రఘురామకు ఇప్పుడు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిన పరిస్థితి. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయన అనుకున్నా.. పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి శ్రీనివాస వర్మను అభ్యర్థిగా అనౌన్స్ చేసింది కమలం పార్టీ.
రఘురామ శుక్రవారమే టీడీపీలో చేరారు. ఉండి టిక్కెట్‌ను ఇంతకుముందు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. తాజాగా ఆయనకు టిక్కెట్ క్యాన్సిల్ చేసి.. రఘురామ కృష్ణరాజుకు ఇచ్చారు.
కూటమి పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి వెళ్ళగా.. అక్కడ RRRకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టిక్కెట్ కేటాయించింది. ఆ టిక్కెట్టు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల దగ్గర పైరవీ చేశారు.
నరసాపురం ఎంపీ రఘురామ.. వైసీపీకి రాజీనామా చేశారు. ఐతే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. ఐతే ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరడంతో.. కమలం పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఐతే బీజేపీ ఆలోచన మాత్రం ఇంకోలా ఉంది.
జనవరి 20న కృష్ణంరాజు జయంతి వేడుకలు మొగల్తూర్‌లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇదే కార్యక్రమంలో రాజకీయ ప్రవేశం గురించి శ్యామలా దేవి కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జయంతి వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నాడు. అయితే, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలోనే ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.