Home » Tag » Raghuveera Reddy
జగనన్నే మళ్లీ రావాలన్నది వైసీపీ నినాదం. రాష్ట్రం బాగుపడాలంటే బాబు మళ్లీ రావాలన్నది టీడీపీ కేడర్ నినాదం. ఏపీ మొత్తం ఇదే సీన్ కనిపిస్తోంది. కానీ ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం జగన్, బాబు పేరు కాకుండా మూడో పేరు తెరపైకి వచ్చింది. ఆయన వస్తేనే ఆ ప్రాంతం బాగుపడుతుందని ఆ ప్రాంతం యూత్ అంతా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలంటూ ర్యాలీలకు సైతం సిద్ధమవుతున్నారు. ఆయనే మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రఘువీరా రెడ్డి రాజకీయంగా వీక్ అయ్యారు. ఆంధ్రాలో కాంగ్రెస్ను బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ 2019 ఎన్నికల తరువాత సీన్ అర్థం చేసకుని సైలెంట్ అయ్యారు.
ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి జాక్ పాట్ కొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిన ఆయనను అధిష్టానం పిలిచి మరీ కీలక పదవిని కట్టబెట్టింది.
కాంగ్రెస్ రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది. తాజాగా జీ 23 సదస్సులో దాదాపు 39 మంది కొత్త సభ్యులతో సీడబ్ల్యూసీ పునర్వవస్థీకరణ జరిగింది.