Home » Tag » Rain Alert
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.
జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 26 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆది, సోమ.. ఈ మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది.
డిసెంబరు మొదటి వారంలో తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని.. ఈ ప్రభావంతో ఏపీవ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లోనూ వచ్చే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
తమిళనాడు నుంచి మొదలు.. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ ఈ నెల 16 నుంచి 20 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ వాతావరణం తుఫానుగా మారుతుందా లేదా అనేది వాతావరణ శాఖ ఇంకా ప్రకటించలేదు.
సెప్టెంబరు 28న నాడు గణేష్ నిమజ్జనం జరగనుంది. హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ హెచ్చరిక సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా వాయుగుండం.. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో రాష్ట్రంలో పశ్చిమం నుంచి ఒక మోస్తరు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిశాయి. అయితే రెండు రోజులుగా మళ్ళీ ఉష్ణోగ్రతలు కొంచం పెరిగాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న ఐదురోజుల పాటూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ పరిస్థితి వచ్చే మంగళవారం వరకూ కొనసాగవచ్చంటున్నారు.
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపిన ఐఎండీ అధికారులు.