Home » Tag » Rains
విజయవాడలో గత 50 ఏళ్ళుగా ఈ స్థాయిలో వర్షం లేదంటున్నారు అక్కడి ప్రజలు. గత రాత్రి నుంచి విరామం లేకుండా వర్షం పడటంతో దాదాపుగా విజయవాడ మొత్తం జల దిగ్బంధంలోనే ఉంది. లోతట్టు ప్రాంతాలతో పాటుగా కాస్త సేఫ్ అనుకున్న ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరింది.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి బుధవారం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
ప్రస్తుతం ఎండలతో మండిపోతున్న జనానికి వాతావరణ నిపుణులు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే వస్తాయని అంటున్నారు. గతేడాది అంచనా కంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్ లోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించాయి. కానీ ఈసారి ముందే వస్తాయంటున్నారు వాతావరణ నిపుణులు.
ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే నాలుగు రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
2024 నైరుతి రుతుపవనాల సీజన్ ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబరు వరకు... గతేడాది కంటే కూడా వర్షాలు భారీగా కురుస్తాయని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో గతేడాది నుంచి కొనసాగుతూ.... ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్నినో అప్పటికీ బలహీనపడనుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 26వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాటు కూడా పడే అవకాశం లేదని తెలిపింది.
వర్షాలు కురిస్తే ఒక తంట.. కురవక పోతే ఎండలతో మంట. ఇలా తయారైంది ప్రస్తుత వాతావరణం పరిస్థితి. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దక్షిణ భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
రైతులకు ఆగస్టు నెల చాలా ముఖ్యం. మెుక్కలు ఎదిగే దశ కాబట్టి వర్షం అవసరం. అయితే చాలా రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంది. హైదరాబాద్లో అడపాదడపా వర్షాలు మినహా.. మిగతా జిల్లాల్లో మాత్రం వరుణుడు పలకరించడంలేదు.