Home » Tag » Raja Singh
బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) కు మరోసారి బెదిరింపు కాల్స్ (Bomb Calls) వచ్చాయ్. పలు నంబర్ల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని ఆశించారు రాజాసింగ్. కానీ ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజాసింగ్. ఇదిలా కంటిన్యూ అవుతున్న సమయంలోనే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఫైనల్ చేసింది.
ఎట్టకేలకు యాత్ర నిర్వహించారు రాజాసింగ్. ఐతే ఈ యాత్రలో జనం ఎక్కువగా ఉండటంతో జేబు దొంగలు తమ చేతివాటం చూపించారు. కొందరు భక్తుల ఖరీదైన సెల్ఫోన్లు, బంగారు చైన్లు దొంగిలించారు.
తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో లోక్ సభ అభ్యర్థుల టిక్కెట్ల లొల్లి నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ శనివారం నాడు తెలంగాణలోని 9 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్ట్ పై బీజేపీ లీడర్ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో అసమ్మతి చెలరేగుతోంది. ఫస్ట్ లిస్టులో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న వారు నిరాశ పడ్డారు.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ అడిగితే.. సికింద్రాబాద్ సీటు అడుగుతా అంటున్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టడానికి తనకంటే కిషన్ రెడ్డి బెటర్ అంటూ.. అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.
రాజాసింగ్ (Raja Singh) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహిష్కరించి.. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా.. ఆయన బీజేపీ (BJP MLA) తరఫున గెలిచారు అంటే.. రాజాసింగ్ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డ్ క్రియేట్ చేసిన రాజాసింగ్‌కు.. పక్కా హిందూ నేతగా (Hindu Leader) మంచి ఫాలోయింగ్ ఉంది.
బీజేపీలో జహీరాబాద్ ఎంపీ సీటు హాట్ అయిపోయింది. అభ్యర్థులుగా నిన్నటి దాకా ఒకరిద్దరి పేర్లు వినిపిస్తే... ఇప్పుడు ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నారట. కొత్త కొత్త లెక్కలు కూడా తెర మీదికి వస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్‌పై సస్పెన్స్ వీడడం లేదు. దీనికోసం రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఒకరు సీనియర్ నేత అయితే.. మరొకరు ఎక్కువగా ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్.. మరొకరు ఇద్దరు సీఎంలను ఓడించిన ఎమ్మెల్యే.
తెలంగాణ మూడో అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. MIM కు చెందిన అక్బరుద్దీన్ ఎదుట తాము ప్రమాణం చేసేది లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ – MIM లోపాయికారి ఒప్పందంతోనే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వీళ్లందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా రాజాసింగ్ వ్యతిరేకించారు.