Home » Tag » Rajahmundry
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం తగలబెట్టిన కేసు అనూహ్యంగా బూమరాంగ్ అయింది. ఏపీలో ఎన్నికల తర్వాత టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య అక్కడక్కడా ఘర్షణలు జరిగాయి.
ఏపీలోని రాజమండ్రి (Rajahmundry) లో కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోడీకి... జనసేనాని పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కడంపై వివాదం నడుస్తోంది. బానిసత్వానికి కూడా హద్దు ఉండాలి అంటూ పవన్ పై సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తరుచుగా చెప్పే... సముద్రం ఎవరి ముందు తలవంచదు డైలాగ్ ను ట్రోల్ చేస్తున్నారు.
పొత్తులో భాగంగా రాజమండ్రి (Rajahmundry) పార్లమెంటు, అనపర్తి (Anaparthi) అసెంబ్లీ సీట్లు బీజేపీకి వెళ్ళాయి. రాజమండ్రి ఎంపీ (Rajahmundry MP) అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖరారయ్యారు. అదే సమయంలో అనపర్తి అసెంబ్లీ టికెట్‌పై సస్పెన్షన్ పెరుగుతోంది.
అలీకి ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ కన్ఫమ్ అన్న టాక్ నడుస్తోంది. అలీ కూడా తాను పోటీకి సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అంటున్నాడు అలీ. గుంటూరు, నంద్యాల లేదా రాజమండ్రి.. వీటిల్లో ఏది ఇస్తారో వేచి చూడాలి.
జైలుకొచ్చే ఏ ఖైదీకి అయినా నాలుగు మంచి బుద్ధులు చెప్పి పంపాలి సిబ్బంది. అతడిలో మార్పు తెప్పించి.. బయట మంచి మార్గంలో బతకమని ప్రోత్సహించాలి. కానీ దొంగతనం మీద జైలుకొచ్చిన ఓ వ్యక్తి దగ్గరే డబ్బులు నొక్కేశారు ఏపీలోని రాజమండ్రి జైలు సిబ్బంది. ఖైదీ దగ్గరే డబ్బులు తీసుకోవడం ఇప్పుడు ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
రాజమండ్రి ఎంపీ (MP) టికెట్ మీద.. వైసీపీ (YCP)లో ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోందట. అభ్యర్థిగా సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ (VV Vinayak) పేరు పరిశీలనలో ఉందన్న వార్తలే అందుకు కారణం. సీటు.. జస్ట్ ఒక్క మీటింగ్ దూరంలోనే ఉందన్న న్యూస్ ఇంకా కాక పుట్టిస్తోందట. వినాయక్ పేరును ముందు కాకినాడ ఎంపీ సీటుకు అనుకున్నా.. అక్కడ పోటీ చేయడానికి ఆయన నిరాకరించినట్టు తెలిసింది.
స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి.. గవర్నర్ ఆసుపత్రి వైద్యుల నుంచి కీలక నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ డాక్టర్లు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటివరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం.
అత్యవసరంగా వైద్యుల్ని పంపించాలని లేఖలో కోరారు. దీనిపై స్పందించిన జీజీహెచ్ వైద్యాధికారులు.. ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు కేటాయించారు. అధికారుల ఆదేశం మేరకు గురువారం సాయంత్రం వైద్యులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించింది. ఈ నెల 24 వరకు టీడీపీ చీఫ్ రిమాండ్ ను పొడగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పెద్ద కుట్ర దాగుందని, దానిని వెలికి తీయాలంటే.. చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు.
రాజమండ్రి వేదికగా నేటి నుంచి ఆదివారం వరకు 32వ మహానాడు జరగబోతుంది. మొదటి రోజు ప్రతినిధుల సభ జరగనుండగా, రెండో రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ మహానాడు సాగబోతుంది.