Home » Tag » Rajahmundry Central Jail
ప్రతీ క్షణం భువనేశ్వరికి ధైర్యం చెప్తూ తోడుగా ఉంటోంది బ్రాహ్మణి. కుటుంబ సభ్యులే కాదు.. పార్టీ నేతలు కూడా ధైర్యం కోల్పోకుండా వాళ్ల మధ్యే ఉంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబుతో జరిగిన ములాఖాత్‌లో బ్రాహ్మణికి చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో ఆయనను అధికారులు విచారించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీతో మరణించారని చెప్పారు లోకేష్. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఆందోళన వ్యకత్ం చేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని కుతంత్రాలు చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు.
ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ మాత్రం ఇప్పటివరకు చంద్రబాబును పరామర్శించలేదు. చివరికి ట్విట్టర్ ద్వారా కూడా రియాక్ట్ కాలేదు. దీంతో నందమూరి ఫ్యామిలీ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరి విషయంలో విమర్శలు చేస్తున్నారు.
రీసెంట్‌గానే ములాఖత్‌లో భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిలను కలిశారు చంద్రబాబు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణను కూడా కలిశారు. ఓ సారి తన లాయర్‌తో ములాఖాత్‌లో మాట్లాడారు. ఇంతకు మించి ములాఖాత్‌కు అనుమతి ఇవ్వమంటూ అధికారులు చెప్తున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు బాలకృష్ణ, నారా లోకేశ్ సమావేశమయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
గురువారం చంద్రబాబును పవన్ కలిసి, పరామర్శిస్తారు. దాదాపు 40 నిమిషాలపాటు ఇరువురూ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.