Home » Tag » Rajamundry Central Jail
తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ అయినప్పటి నుంచి ఏపీలో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబుకు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ నేడు హైకోర్టు తీర్పు వెలువడించనుంది. ఈ క్రమంలో ఆయన పై ఇంకో కేసు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
నారా లోకేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జగన్ పై మండిపడ్డారు.
వర్మ సడెన్గా చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు ప్రత్యక్షమయ్యాడు. జైలుకు దూరంగా బ్యారికేడ్ల ముందు నిల్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెంట్రల్ జైల్తో సెల్ఫీ.. నేను బయట అతను లోపల అంటూ క్యాప్షన్ కూడా రాశాడు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 25 నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ కీలక నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.
తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బోండ ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 19 వరకూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలని తెలిపింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా 14 రోజులు రిమాండ్ అనగా సెప్టెంబర్ 24 వరకూ ఆదేశించింది. ఆతరువాత మరో రెండు రోజులు కస్టడీ నేపథ్యంలో రిమాండ్ పొడిగించింది. ఈ లోపు మరిన్ని కేసులు వెంటాడడంతో అక్టోబర్ 5 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే రేపటితో కోర్టు ఇచ్చిన రిమాండ్ గడువు ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల ఏం జరుగుతుందా అని ఉత్కంఠ అందరిలో నెలకొంది.