Home » Tag » Rajani Kanth
దేవర తర్వాత వార్ 2, తర్వాత డ్రాగన్ ఇలా వరుసగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా లు పైప్ లైన్ లో ఉన్నాయి. కట్ చేస్తే మొన్నటి వరకు వచ్చిన గాసిప్సే నిజమయ్యాయి. తనతో సినిమా తీసేందుకు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ ఎంత క్యూరియస్ గా ఎదురుచూస్తున్నాడో తేలింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జపాన్ లో రోజు రోజుకి ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ రాకముందే, జపాన్ లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. యూట్యూబ్ లో దుమ్ముదులిపిన తన పాత సినిమాలే, జపాన్ లోతనకా రేంజ్ ఫ్యాన్ బేస్ కి అక్కడ క్రియేట్ చేసింది.
సూపర్ స్టార్ రజనీ కాంత్ కు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మధ్య ఫాలోయింగ్ లో చాలా తేడా ఉంది. రజనీ కాంత్ కు వరల్డ్ వైడ్ ఇమేజ్ ఉంటే ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. దేవర సినిమాకు ముందు దేవర సినిమా తర్వాత అన్నట్టు ఉంది ఎన్టీఆర్ క్రేజ్.
తమిళ సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీ కాంత్ కొడుతున్న హిట్ లు చూసి అక్కడి యువ హీరోలు అలాగే ఇక్కడి సీనియర్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఎలా ఇది సాధ్యం అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్” ఇప్పుడు సినిమా ప్రేక్షకుల అందరికి ఓ రేంజ్ లో పిచ్చి లేపుతున్న సీరీస్. ఈ సీరీస్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ సినిమాను ఇప్పటికీ మన తెలుగులో చూస్తూ ఉంటారు జనాలు. విక్రమ్ సినిమా కూడా ఓ రేంజ్ లో పాపులర్ అయింది.
దేవర ట్రెండ్ నడుస్తున్న టైం ఇది..అలాంటి టైంలో పోటీకి సీన్ లోకొచ్చాడు వెట్టయాన్. కోలీవుడ్ సూపర్ స్టార్ మీద తెలుగు జనాల్లో అభిమానానికి కొదువేం లేదు. అలానే తను హాస్పిటలైజ్ అవటం వల్ల అలా కూడా జనాల్లో సానుభూతి ఉంది.
దేవర సినిమా దసరా ముందు మళ్ళీ జాతర మొదలుపెట్టింది. నెగటివ్ టాక్ తో ముందు ఇబ్బంది పడినా సినిమా ఇప్పుడు సునామీ సృష్టిస్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తైనా సినిమా సందడి మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.
దేవర సినిమా దెబ్బకు ఇప్పుడు చిన్న సినిమాలు విడుదల చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దాదాపు దేవర మేనియానే కొనసాగుతోంది. మౌత్ టాక్ తో దేవర సినిమా స్పీడ్ పెంచింది.
ఇప్పట్లో విడుదలయ్యే సినిమా లేదు. ఒక్కటంటే ఒక్క స్టార్ హీరో సినిమా లేదు. దేవర జాతరను ఆపే దమ్మున్న సినిమా విడుదల కావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. డిసెంబర్ వరకు ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే సీన్ కనపడటం లేదు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత పెరిగిందో తెలుసా.... ఒకే ఒక్క సినిమాతో ఖాన్లు, కపూర్ల నే కాదు, సూపర్ స్టార్ రజినీకాంత్ ని దాటేశాడు.. చైనీస్ కూంగ్ ఫూ స్టార్ జాకీ ఛాన్ ని మించిపోయాడు. ఏకంగా హాలీవుడ్ స్టార్ల లిస్ట్ లో చేరేంత వరకు నిచ్చెనెక్కాడు.