Home » Tag » Rajkot
భారత బౌలర్ల జోరుకు, జైస్వాల్ విధ్వంసకర సెంచరీ కూడా తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు.
కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్.. బీసీసీఐ అనుమతితో జట్టును వీడి చెన్నైకి బయల్దేరాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అశ్విన్‌కు బోర్డు అండగా ఉంటుందని తెలిపింది.
ఈ మ్యాచు ద్వారా సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచులోనే సర్ఫరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. చాలా కాలం జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన సర్ఫరాజ్.. మొదటి మ్యాచులోనే సత్తా చాటాడు.
రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం తుదిజట్టులో ఇంగ్లండ్ కీలక మార్పులు చేసింది. రాజ్ కోట్ పిచ్ పై పేస్ ఎటాక్ తో బరిలోకి దిగుతోంది. మూడో టెస్టుకు ఇద్దరు పేసర్లు అండర్సన్, మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చారు. తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్‌తోనే ఆడింది.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఈ మ్యాచ్ కు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లకు హోటల్లోని సౌరాష్ట్ర థీమ్ తో ఉన్న స్పెషల్ సూట్ లను ఇచ్చారు. ఇక టీమ్ మొత్తానికి కఠియావాడీ స్పెషల్ వంటకాలను వడ్డిస్తున్నారు. సౌరాష్ట్ర రాచరిక వైభవం ఉట్టిపడేలా రాయల్ హెరిటేజ్ థీమ్ తో ఉన్న ప్రెసిడెన్షియన్ సూట్ ను రోహిత్ శర్మకు కేటాయించారు.
రవీంద్ర జడేజా.. టీమిండియా ప్రధాన ఆల్‌రౌండర్.. ఆసియా కప్-2022 సందర్భంగా గాయపడ్డ జడ్డూ పునరాగమనంలో అదరగొట్టాడు. ముఖ్యంగా స్వదేశంలో ఆస్ట్రేలియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌లో దుమ్ములేపాడు. అద్భుత ప్రదర్శనతో.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.