Home » Tag » Rajya Sabha
ఏపీలో అధికారంలో ఉన్నన్నాళ్ళూ... బీజేపీకి అంటకాగి... NDA ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు దూరమైనట్టేనా ? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా తర్వాత బీజేపీతో తాడో పేడోకి రెడీ అయినట్టు అర్థమవుతోంది. గత మోడీ ప్రభుత్వ హయాంలో వైసీపీని వాడుకున్న బీజేపీ... ఏపీలో చంద్రబాబు, పవన్ దగ్గరవగానే వదిలేసింది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై వార్ మొదలు పెట్టేశారు మాజీ సీఎం జగన్. ఘోర ఓటమి తర్వాత నెల రోజులుగా ఆయనకు ఏం చేయాలో తెలియలేదు. అందుకే తాడేపల్లి టు పులివెందులు... అక్కడి నుంచి బెంగళూరు... మళ్ళా తాడేపల్లి... మళ్ళీ బెంగళూరు... ఇలా చక్కర్లు కొట్టారు. జులై 15 నుంచి ప్రజాదర్భార్ అన్నారు... అంతకుముందు ఓదార్పు ఉంటుందని టాక్ వచ్చింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.. దయనీయంగా మారింది. నేతలు.. ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతుంటే.. రాజ్యసభ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని పరిస్థితి.. ఉన్న రాజ్యసభ ఎంపీలు ఉంటారా లేదో తెలియని అయోమయం..
2019లో వైసీపీలో చేరిన నటుడు అలీకి మొదట్లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కుతుందనీ... ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభకు పంపుతారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు.. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
భారత లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. లోక్‌సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది.
వ్యాపార కుటుంబానికి చెందినప్పటికీ.. సామాజిక సేవ, రచన, విద్యారంగాల్లోనూ సత్తాచాటి.. తనదైన ముద్ర వేశారు. ఆమె రచయిత్రిగా, మోటివేషనల్ స్పీకర్‌గా, సోషల్ యాక్టివిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. మహిళా దినోత్సవం రోజునే సుధామూర్తిని రాష్ట్రపతి, రాజ్యసభకు నామినేట్ చేయడం విశేషం.
ఫిబ్రవరి 27న జయప్రదకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ క్రమంలో ఆమె కోసం పోలీసులు వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. తాజాగా సోమవారం ఉదయం జయప్రద.. తన లాయర్లతో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టుకు చేరుకున్నారు.