Home » Tag » Ram Lalla
లక్నో తరఫున ఆడనున్న సౌతాఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహారాజ్‌తో పాటు స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అప్పట్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామ్ లల్లా దర్శనం ఉండేది. కానీ భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి పదింటి దాకా ఆలయం తెరిచే ఉంచుతున్నారు. కానీ బాల రాముడిని ఉదయం నాలుగింటికే నిద్ర లేపుతున్నారు ఆలయ పూజారులు.
అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారని.. అందుకే ఈ పేరును నిర్ణయించామని.. ఇకపై ఈ ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని వివరించారు.
జనవరి 22 అనే తేదీప్రతి భారతీయుడి గుండెల్లో మర్చిపోలేని ఒక అధ్బుతమైన రోజుగా గుర్తుండిపోతుంది. తను పుట్టిన ఏలిన అయోధ్య లో ఆ శ్రీరామచంద్రుడికి నేడు స్థిరనివాసం ఏర్పడింది. తన ధర్మపత్ని సీతమ్మతల్లి, అగ్రజుడు లక్ష్మణుడు, అనుచరుడైన ఆంజనేయుడు తో కలిసి రామ్ లల్ల అయోధ్య లో ప్రాణ ప్రతిష్ట గావించాడు. ఇలాంటి పర్వదినాన తెలుగు చిత్ర సీమకి చెందిన ఒక హీరో తండ్రి అవ్వడం ఇప్పుడు ప్రాధానత్యని సంతరించుకుంది.
500యేళ్ళుగా యావత్ భారతీయులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అయింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట జరిగింది. గర్భగుడిలో అందంగా అలంకరించిన రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. గర్భగుడిలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆలయ పూజాలు పాల్గొన్నారు.
అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేళ మనం ఇంట్లో ఎలా పూజలు నిర్వహించుకోవాలి. ఏయే గ్రంథాలు చదువుకోవాలి.... రాముడికి నైవేధ్యాలు ఎలా సమర్పించాలి...
ఎవరి గురించైనా పది, ఇరవై, వంద.. రెండొందలు, మూడొందల ఏళ్ల వరకే చెప్పుకుంటామేమో. కానీ, రాముడి గురించి ఏడువేల ఏళ్ల నుంచి ఈ జాతి తమ ప్రతినిధిగా చెప్పుకుంటోంది. మర్యాద పురుషోత్తముడు అనే పేరుతో పిలుచుకుంటోంది.
ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ రూపంలో రాముడు.. ప్రాణ ప్రతిష్ఠ తరువాత అందరికీ దర్శనమిస్తాడని భావించారు. కానీ, అందరికీ ముందుగానే దర్శనమిచ్చాడు.
బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది. రాముడి విగ్రహం ఊరేగింపుగా విచ్చేసింది. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు. పసితనం, అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది.