Home » Tag » Ram Nath Kovind
వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మాజీ (Former President) రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నివేదికను త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనిపై సమగ్రంగా చర్చించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100 రోజుల అజెండా సిద్ధం చేసుకోవాలని PM ఎన్నికలకు ముందే అన్ని శాఖలను ఆదేశించారు.
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' విధానం ప్రకారం.. దేశంలో గతంలో ఉన్న వన్ టైమ్ ఎలక్ష్సన్స్ పునరుద్ధరించాలి. ఈ అవసరాన్ని కమిటీ సూచించింది. లోక్‌సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. దీనికోసం దేశవ్యాప్తంగా, దశలవారీగా ఎన్నికలు నిర్వహించాలి.
ప్రధాని మోడీ ప్రభుత్వ పదవీకాలం కొన్నినెలల్లో ముగియనుంది. దీంతో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను ఇంకా ఎక్కువ రోజులు సాగదీయడం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికలపై క్లారిటీ వస్తే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీపైనా బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. దీని సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కలిశారు. ఎన్నికల ప్యానెల్ ఏర్పాటుపై చర్చించారు.