Home » Tag » Ranji
ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది యువ బ్యాటర్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా దంచేస్తున్నారు. ఆడుతోంది రెడ్ బాల్ తోనే, వన్డే ఫార్మాట్ లోనా అన్నది చూడకుండా పరుగుల వరద పారిస్తున్నారు. అందుకే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి.
రంజీ మ్యాచ్ లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు... ఓపిగ్గా ఆడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడాలి.. ఇక డబుల్ సెంచరీ అయితే దానికి రెట్టింపు పట్టుదల కావాల్సిందే.. మరి ట్రిపుల్ సెంచరీ కొట్టాలంటే ఎంతో సత్తా ఉండాలి... తాజాగా రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో రికార్డుల మోత మోగింది.
పేలవ ఫామ్ తో జాతీయ జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ రంజీల్లో అదరగొడుతున్నాడు. రీఎంట్రీ కోసం కష్టపడుతున్న శ్రేయాస్ వరుస సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ సీజన్లో మహారాష్ట్రపై శతక్కొట్టిన శ్రేయస్.. తాజాగా ఒడిషాపై సెంచరీతో కదంతొక్కాడు.
భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఇప్పుడు బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన చాహల్ మొన్నటి వరకూ కౌంటీ క్రికెట్ లో అదరగొట్టాడు.
టీమిండియా వెటరన్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా మాత్రం సెలక్షన్తో సంబంధం లేకుండా ఆడుతుంటాడని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా అతడు ముందుకు సాగుతున్న తీరు అమోఘమని ప్రశంసించాడు.